ఫోకస్

ఆహ్వానించదగ్గ పరిణామం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా నిలిచిన అయోధ్య వివాదాన్ని కోర్టు వెలుపల పరిష్కరించుకోవాలంటూ దేశంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చేసిన సూచన ఆహ్వానించదగ్గ శుభ పరిణామం. ఇలాంటి జటిల సమస్యను పరస్పర సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోగల్గితే ఇలాంటి వివాదాల పరిష్కారంలో భారతదేశం ప్రపంచంలోనే ఆదర్శంగా నిలువగలదు. అసలు భగవంతుడు అనేవాడు ఉన్నాడా లేడా అనేది ఎవరి విశ్వాసం వారిది. బిడ్డ పుట్టిన తర్వాత తల్లి చెబితేనే ఆ బిడ్డకు తండ్రి ఎవరో ఈ లోకానికి తెలుస్తుంది. ధార్మిక ప్రజా జీవనంలో ప్రపంచంలోనే భారతదేశం ఎంతో ముఖ్యమైనది. పూర్వకాలంలో ఎందరో చక్రవర్తులు ఈ దేశాన్ని పాలించారు. వారే న్యాయ నిర్ణేతలు. ప్రశ్నించేవారు లేరు. ఎవరో నియమిస్తే వారు చక్రవర్తులు కాలేదు. శక్తసామర్థ్యాలతో పోరాడి వచ్చారు. ఇక నేటికీ రామరాజ్యం కావాలని కోరుకుంటున్నాం. సీతమ్మవారిని రావణుడు లంకలో నిర్బంధించిన తర్వాత అగ్నిప్రవేశంలో తన పునీతత్వాన్ని చాటుకున్న ఓ నిరక్షరాస్యుడు చేసిన అపవాదుకు శ్రీరాముడు తన ప్రాణానికి మించి గౌరవించే సీతమ్మను నిండుచూలాలిగా ఉన్నప్పుడు అడవులకు పంపి ఆమె జ్ఞాపకాలతో ఎంతో నిబద్ధతతో రాజ్యాన్ని పాలించబడ్డ ఆయన జన్మస్థలం అయోధ్యలో నిర్మితమైన ప్రార్థనా మందిరాన్ని బాబర్ కూల్చి మసీదు నిర్మించటం జరిగింది. వాస్తవానికి ముస్లింలు ఆరాధించే మక్కా మదీనాలాంటి ప్రార్థనా మందిరం కాదు. నాటినుంచి నేటికీ శ్రీరామునికి పూజలు జరుగుతున్నాయి. ఇక మెజార్టీ హిందూ సమాజాన్ని చులకనగా చూడరాదు.. ఏనాడో జరిగిన తప్పిదాన్ని ప్రజాస్వామ్యంలో సవరించుకునే పరిస్థితి ఉన్నందున సుప్రీంకోర్టు సూచన ఆహ్వానించదగినది.

- పైడికొండల మాణిక్యాలరావు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయశాఖ మంత్రి