ఫోకస్

చర్చలతో పరిష్కారమయ్యేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అయోధ్య వివాదాన్ని చర్చలతో పరిష్కరించుకోవాలని సుప్రీంకోర్టు సూచించడంతో అందరి దృష్టీ మళ్లీ ఈ అంశంపైకి మళ్లింది. ‘రామజన్మభూమి-బాబ్రీ మసీదు’ అంశం భావోద్వేగాలతో ముడిపడి ఉన్నదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఇరు వర్గాలు కోరితే మధ్యవర్తిత్వానికి కూడా సిద్ధమేనని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జెఎస్ ఖేహర్ వ్యాఖ్యానించారు. అర్థవంతమైన, చిత్తశుద్ధితో కూడిన చర్చలు అవసరమని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. అయోధ్యను సాకేతపురమని అంటారు. అయోధ్య భారతదేశంలోని అత్యంత పురాతన నగరాల్లో ఒకటి. విష్ణువు శ్రీరాముడిగా అవతరించిన ప్రదేశంగా ఇతిహాసాలు, పురాణాలు చెబుతున్నాయి. రామాయణ మహాకావ్యావిష్కరణకు మూలం అయోధ్య. అయోధ్య కోసల రాజ్యానికి రాజధానిగా ఉంటూ వచ్చింది. 63వ సూర్యవంశ రాజైన దశరధుడు రాజ్యసభ అయోధ్యలో ఉంది. దశరథుడి కుమారుడు అవతారపురుషుడైన శ్రీరాముడు. అయోధ్య దేవతల చేత నిర్మించబడిందని, అందువల్లనే స్వర్గపురిగా వర్థిల్లిందనే కథనాలు కూడా ఉన్నాయి. వాల్మీకి రచించిన రామాయణ మహాకావ్యం మొదటి అధ్యాయాల్లో అయోధ్య మహోన్నతంగా వర్ణించబడింది. ఇది గతం... వర్తమానంలో అయోధ్య వివాదాస్పద కేంద్రంగా మారింది. అయోధ్య రామజన్మభూమి దేవాలయ వివాదం గత ఏడేళ్లుగా సర్వోన్నత న్యాయస్థానం పరిశీలనలోనే ఉంది. అంతకుపూర్వం దశాబ్దాలపాటు అలహాబాదు ఉన్నత స్థానం పరిశీలన చేసింది. ఇన్నాళ్ల తర్వాత ఉన్నత న్యాయస్థానం తన ఆలోచనలను వ్యక్తం చేసింది. అయోధ్య రామజన్మభూమి మందిరాన్ని క్రీ.శ 1528లో బాబర్ కూల్చివేశారనేదే వివాదానికి మూలం. ఈ చారిత్రక సత్యాన్ని అంగీకరించని వారికి ఆల్ ఇండియా ముస్లిం లా బోర్డు వంటి సంస్థలు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. బాబర్ పేరుతో చెలామణిలోకి వచ్చిన కట్టడం బాబర్ మసీదు, తర్వాతి కాలంలో అదే బాబ్రీ మసీదుగా మారింది. ఎంతోకాలంగా అపరిష్కృతంగా ఉన్న ఈ వివాదం పరిష్కారంపై సుప్రీంకోర్టు కీలక సూచనలు చేసింది. ‘ఈ అంశాలు మత భావోద్వేగాలతో ముడిపడినవి. వివాదానికి ముగింపు పలికేందుకు ఈ అంశంపైన అన్ని వర్గాలు కలిసి అంగీకారానికి రావచ్చు. ఈ అంశాన్ని ఉమ్మడిగా పరిష్కరించుకుంటే ఉత్తమం. కలిసి కూర్చుని సుహృద్భావ వాతావరణంలో చర్చలు జరపవచ్చు’ అని సుప్రీంకోర్టు సలహా ఇచ్చింది. అర్థవంతమైన, చిత్తశుద్ధితో కూడిన చర్చలకోసం కక్షిదారులు కొంత ఇచ్చి కొంత పుచ్చుకునే విధానం అవలంభించాలని కూడా కోరింది. ఇస్లామిక్ దేశాల్లో అనుసరిస్తున్న విధానాల ప్రకారం రోడ్ల నిర్మాణం వంటి ప్రజాప్రయోజనాలకోసం మసీదును వేరే స్థలానికి మార్చవచ్చని, అయితే ఒకసారి హిందూ ఆలయాన్ని నిర్మించాక దానిని ముట్టుకోకూడదని పిటిషన్‌లో సుబ్రహ్మణ్యస్వామి కోరారు. మొత్తం మీద సుప్రీం సూచనపై బిజెపి సానుకూలంగా స్పందించగా, కాంగ్రెస్ పార్టీ ఏకాభిప్రాయ పరిష్కారం అవసరమని పేర్కొంది. ఈ అంశంపై కొంతమంది ప్రముఖుల అభిప్రాయాలే ఈ వారం ఫోకస్.