ఫోకస్

రాజ్యాంగబద్ధంగా జరగాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముస్లింలకు రిజర్వేషన్లు మతపరంగానే భావిస్తున్నారు. ఇది ప్రచార లోపమా, నిజంగా పాలకవర్గం తీసుకున్న నిర్ణయమా? అన్నది ఇంకా సందిగ్దంలోనే ఉంది. గతంలో ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నామని ఒక ప్రభుత్వం ప్రకటిస్తే.. మరో ప్రభుత్వం 12 శాతం రిజర్వేషన్లను ప్రకటించింది. అయితే అది ఆచరణలో ఏ మేరకు జరిగింది.. జరుగుతోందన్న మీమాంస అందరిలో ఉంది. నాటి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం ప్రకటించిన నాలుగు శాతం ముస్లిం రిజర్వేషన్లపై ప్రజలు, పార్టీల నుంచి పెద్దగా వ్యతిరేకత కనిపించలేదు. కానీ టిఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రకటించిన 12శాతం రిజర్వేషన్లపై ఓ రాజకీయ పార్టీ, కొన్ని కుల సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. దేశంలో ఎన్నో మతాలవారు, జాతుల వారు జీవిస్తున్నారు. వారి వారి సంస్కృతి, సంప్రదాయాలకనుగుణంగా జీవనం గడుపుతున్నారు. కుల సంఘాలపై రాజకీయాలు ఆధారపడడం ఎప్పుడైతే మొదలైందో.. నాటినుంచి రిజర్వేషన్లపై దృష్టి సారించబడింది. ఇప్పటివరకు ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు రాజ్యాంగబద్ధంగా ఉన్నాయి. అవి రాజ్యాంగ సవరణలు జరిగినప్పుడల్లా కొంత శాతం రిజర్వేషన్లు పెరుగుతూ వచ్చాయి. బిసి రిజర్వేషన్లు జనాభా ప్రాతిపదికన దామాషా ప్రకారం జరగాలని పోరాటం సాగించారు. ఈ నేపథ్యంలో బిసి, ఓబిసి, ఇతర కులాలు కూడా రిజర్వేషన్లనే కోరుతున్నాయి. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు మతపరంగా జరుగుతున్నాయని ప్రచారంలోకి వచ్చింది. కాబట్టి మతపరమైన రిజర్వేషన్లను వ్యతిరేకించడంలో తప్పులేదు. కాని ముస్లింలలో కూడా ఆర్థికంగా వెనుకబడి దుర్భర జీవితాలు గడుపుతున్న వారు ఉన్నారు. ముస్లింలే కాదు.. ఇంకా మైనార్టీ వర్గాలు కూడా ఉన్నాయి. ఆర్థికంగా వెనుకబడినవారి స్థితిగతులను బట్టి రిజర్వేషన్లు కల్పించడంలో తప్పులేదు. రిజర్వేషన్లు పారదర్శకంగా ఉండాలి. అవి రాజ్యాంగబద్దంగా జరగాలి.

-జగన్‌మోహన్ మెట్ల లోక్‌సత్తా, తెలంగాణ కన్వీనర్