ఫోకస్

మతపరమైన రిజర్వేషన్లు ఉండరాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఉండరాదు. ప్రాంతాలు, అట్టడుగు వర్గాల కులాల రిజర్వేషన్లవల్ల అభివృద్ధి, సంక్షేమానికి అవకాశం ఉంటుంది. మతాలవారీగా రిజర్వేషన్లు దేశ మనుగడకు మంచిది కాదు. బిజెపి ఇలాంటి రిజర్వేషన్లకు వ్యతిరేకం. ఈ విషయాన్ని అనేకమార్లు వెల్లడించాం. ముస్లింలకు రిజర్వేషన్ల అంశంపై తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆందోళనలు జరిగాయి. హైదరాబాదులో అసెంబ్లీని ముట్టడించడం జరిగింది. ఓటు బ్యాంకుకోసం మతాల రిజర్వేషన్లు కల్పించాల్సిన అవసరం లేదు. మెజార్టీ ప్రజల భావజాలంకూడా మారుతోంది. ఈ తరుణంలో ప్రత్యేకంగా మత రిజర్వేషన్లు అంత శ్రేయస్కరం కాదు. ముస్లింల అభివృద్ధికి ప్రభుత్వాలు అనేక సంక్షేమ పథకాలు రూపొందిస్తున్నాయి. ఇప్పటికే అనేకం అమలులో ఉన్నాయి. ఇకపై ఓటు బ్యాంకు రాజకీయాలకోసం మత రిజర్వేషన్ల అవసరం ఉండదు. అభివృద్ధి, సంక్షేమ ఫలాలను ప్రజలకు అందించడంపైనే రాజకీయ పార్టీల మనుగడ ఆధారపడి ఉంటుంది. గతంలో కూడా సుప్రీం కోర్టు మతపరమైన రిజర్వేషన్లను రద్దు చేసింది. ఏపిలో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇది జరిగింది. రాజ్యాంగ బద్ధంగా కూడా మతాలకు రిజర్వేషన్లు కల్పించలేదు. కోర్టు తీర్పు కూడా మత ప్రాతిపదికన రిజర్వేషన్లకు వ్యతిరేకంగానే వస్తుంది.

-అంకాల్‌రెడ్డి జిల్లా బిజెపి అధ్యక్షుడు, అనంతపురం