ఫోకస్

వైఎస్‌దే ఆ ఘనత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మైనారిటీలకు రిజర్వేషన్లు కల్పించిన ఘనత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డికే దక్కుతుంది. సమాజంలో 10శాతం వరకు జనాభా ఉన్న ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లను కల్పించారు. మన దేశంలో ముస్లింలు అంతర్భాగం. ముస్లింలో మిగతా వర్గాల కంటే పేదలు ఎక్కువ. వీరి అభ్యున్నతికి రిజర్వేషన్లు కచ్చితంగా దోహదపడుతాయి. ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్ల వల్ల మంచి మెడికల్, ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్లు పొందారు. గ్రూప్-1, గ్రూప్-2 ఉద్యోగాలు లభించాయి. అయతే న్యాయ స్ధానాల్లో చుక్కెదురయ్యే అవకాశాలు ఎక్కువ. అందుకే పక్కాగా రిజర్వేషన్ల విధానాన్ని అమలుచేయాలి. రిజర్వేషన్లు కల్పించడం, ఉద్యోగావకాశాలను కుదించి వేయడం, కాంట్రాక్టు ఉద్యోగాల నియామకాలను పెంచడం వల్ల ఏమి ప్రయోజనం ? గ్రూప్-1, గ్రూప్-2తో పాటు అన్ని కేటగిరీల ఉద్యోగాలను ఎప్పటికప్పుడు భర్తీ చేయాలి. పోలీసు కానిస్టేబుల్, టీచర్ల ఉద్యోగాలను సకాలంలో భర్తీ చేస్తే కొంతలో కొంత రిజర్వేషన్ సదుపాయం ఉన్న వర్గాలకు ఊరట కల్పించినట్లవుతుంది. ముస్లింలకు రిజర్వేషన్‌ల విషయమై కొన్ని రాజకీయ పార్టీలు మతం కోణంలో చూస్తున్నాయి. ముస్లింల పరిస్థితి, మిగతా వర్గాల కంటే అధ్యాన్నంగా ఉంది. వీరికి సంక్షేమ ఫలాలు అందే విధంగా చర్యలు తీసుకోవాలి. ముస్లిం యువతలో నైపుణ్యాభివృద్ధికి శిక్షణ కేంద్రాలు నెలకొల్పాలి. ముస్లింను ఓటు బ్యాంకు మాదిరిగా చూసే పద్ధతిని రాజకీయ పార్టీలు విడనాడాలి. ఆ వర్గాలకు రాజకీయ ప్రాధాన్యత ఇవ్వాలి. టిడిపి ప్రభుత్వంలో ఒక మంత్రి పదవిని కూడా మైనార్టీవర్గాలకు ఇవ్వలేదు. ఇది చాలా శోచనీయమైన విషయం. ఎస్సీ, ఎస్టీ, బిసిలకు రిజర్వేషన్లు కల్పించి, వాటి అమలుకు, అభ్యర్ధుల్లో ప్రతిభను పెంచేందుకు అనేక రకాలైన కోచింగ్ సంస్ధలనుప్రభుత్వం ఏర్పాటు చేసింది. ముస్లింల విషయంలో కూడా ఆర్ధిక, సామాజికాభివృద్ధికి అధికారంలోకి వచ్చే పార్టీలు రాజకీయాలకు అతీతంగా చర్యలు తీసుకోవాలి.

- విశే్వశ్వరరెడ్డి, వైకాపా శాసనసభాపక్ష ఉపనేత, ఆంధ్రప్రదేశ్