ఫోకస్

వారి పరిస్థితి దయనీయమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సచార్ కమిటీ నివేదిక ప్రకారం మైనారిటీల పరిస్థితి దయనీయంగా ఉంది. ఇంత కాలం వారిని ఓటు బ్యాంకుగానే చూశారు. మైనారిటీల జీవన స్థితిగతులను మెరుగు పరిచేందుకు 12శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని టిఆర్‌ఎస్ ఎన్నికల ప్రణాళికలోనే పేర్కొంది. టిఆర్‌ఎస్ ఎన్నికల ప్రణాళికకు ప్రజలు ఆమోదం తెలిపి అధికారం అప్పగించారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటాం. ఇవి మతపరమైన రిజర్వేషన్లు కావు. మైనారిటీల్లోని వెనుకబడిన వారికి ఇచ్చే రిజర్వేషన్లు రాష్ట్రంలో కొత్త కాదు. గతంనుంచి అమలులో ఉన్నవే. జనాభా ప్రాతిపదికన వాటి శాతాన్ని పెంచడం తప్ప కొత్తగా ఇస్తున్నది కాదు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోనే రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందుకే ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్రంలో నాలుగు శాతం రిజర్వేషన్లు అమలు జరుగుతున్నాయి. తెలంగాణలో ప్రత్యేక పరిస్థితులు, ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీల సంఖ్య ఎక్కువగానే ఉంది. రిజర్వేషన్లు 50 శాతం మించరాదు అంటే తెలంగాణ లాంటి రాష్ట్రానికి సాధ్యం కాదు. తమిళనాడులో 69 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు. అక్కడ ఉన్నట్టుగానే తెలంగాణలోనూ అవకాశం ఇవ్వాలి. అసెంబ్లీలో తీర్మానం చేసిన తరువాత కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. కేంద్రాన్ని కలుద్దాం, సుప్రీంకోర్టును అభ్యర్థిద్దాం అని శాసనసభలోనే ముఖ్యమంత్రి చెప్పారు. సచార్ కమిటీ నివేదికను పరిశీలిస్తే మైనారిటీలు ఆర్థికంగా, సామాజికంగా ఏ పరిస్థితుల్లో ఉన్నారో అర్థమవుతుంది. సమాజంలో అన్ని వర్గాలు అభివృద్ధి చెందాలి, ఏదో ఒక వర్గం వెనకబడి మిగిలిన వారు అభివృద్ధి చెందితే అది సంపూర్ణ అభివృద్ధి అనిపించుకోదు. అభివృద్ధి ఫలాలు, ఉద్యోగ అవకాశాలు అందరికీ దక్కాలి. మైనారిటీల్లో పేదరికం, సామాజిక వెనకబాటు తనం ఆధారంగా 12శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. తెలంగాణ విభిన్న మతాలు, సంస్కృతులకు నిలయం. తమ మత విశ్వాసాలను కాపాడుకుంటూనే ఇతర మతాల పట్ల సోదర భావం కలిగి ఉండడం తెలంగాణ ప్రత్యేకత. దీనిని నిలబెట్టుకుంటూ అందరి అభివృద్ధిని కాంక్షిస్తూ 13శాతం రిజర్వేషన్లు సాధిస్తామనే నమ్మకం ఉంది. వీటిని మతపరమైన రిజర్వేషన్లుగా భావించరాదు. ఇంతకు ముందు ఉన్న రిజర్వేషన్ల శాతాన్ని కొంత వరకు పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది.

- పల్లా రాజేశ్వర్‌రెడ్డి టిఆర్‌ఎస్ ఎమ్మెల్సీ శాసన మండలిలో ప్రభుత్వ చీఫ్‌విప్