ఫోకస్

శాస్ర్తియ విధానంలో రిజర్వేషన్లుండాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మారుతున్న కాలానికి, ప్రజల అవసరాలకు అనుగుణంగా రిజర్వేషన్లపై ప్రభుత్వ విధానం ఉండాలి. రాజకీయ లబ్ధికోసం పాకులాడితే భవిష్యత్తులో దుష్పరిణామాలు వచ్చే అవకాశాలు లేకపోలేదు. అందుకే పాలకులు రాజకీయ కోణంలో కాకుండా, ప్రజల ఆర్థిక పరిస్థితి, జీవన విధానాలను పరిశీలించి, రిజర్వేషన్లపై నిర్ణయాలు తీసుకోవాలి. రిజర్వేషన్లపై అవసరాలను బట్టి మార్పులు, చేర్పులు చేయవచ్చు. అయితే అవి శాస్ర్తియంగా, న్యాయపరంగా, చట్టపరంగా ఉండాలి. రిజర్వేషన్ల విషయంలో అవసరాలను బట్టి స్వల్ప సవరణలు చేయడంలో తప్పులేదు. ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించాలని కొన్ని రాష్ట్రప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి. చాలా మంది తమిళనాడును ఉదాహరణగా తీసుకుంటున్నారు. తమిళనాడులో ప్రస్తుతం 69 శాతం రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయి. ఈ రిజర్వేషన్లలకు ముస్లింల రిజర్వేషన్ శాతం కేవలం 3.5 శాతం మాత్రమే. ఈ విధానంపై సుప్రీంకోర్టులో తొమ్మిది మందితో కూడిన బెంచ్ విచారణ చేస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో 2004లో ముస్లింలకు ఐదు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ వైఎస్‌ఆర్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు కొట్టివేసింది. మతపరమైన రిజర్వేషన్లు కల్పించడం సరికాదని కోర్టులు స్పష్టం చేశాయి. దాంతో వైఎస్ ప్రభుత్వం ముస్లిం కమ్యూనిటీ ఆర్థిక పరిస్థితి, సామాజిక పరిస్థితిపై బిసి కమిషన్ చేత విచారణ చేయించి, ముస్లింలలో వృత్తి పనులు చేసుకునే వారిని బిసిల జాబితాలోకి చేర్చి (బిసి-ఇ గ్రూపు) నాలుగుశాతం రిజర్వేషన్లు అమలుచేయడం ప్రారంభించారు. దేశంలో రిజర్వేషన్లు (విద్య, ఉద్యోగాలు) 50 శాతం మించకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలంటూ భారత ఉన్నత న్యాయస్థానం పలుపర్యాయాలు సూచించింది. మనది లౌకికదేశం. సమాజంలో కుల, మతాలకు అతీతంగా అందరికీ చదువుకునే అవకాశం కల్పించాలి. రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ బి.ఆర్. అంబేద్కర్ ఎస్‌సి, ఎస్‌టిల రిజర్వేషన్లపై 10 ఏళ్ల తర్వాత పునఃసమీక్షించాలని సూచించారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చి 70 ఏళ్లయినా, రిజర్వేషన్లను పొడిగిస్తున్నారే తప్ప, పునఃసమీక్షించడం లేదు. సమాజంలో అట్టడుగున్న ఉన్నవారికి ప్రభుత్వం చేయూత ఇవ్వాల్సిందే. ఒక వ్యక్తి ఐఎఎస్ లాంటి ఉన్నత పదవి చేపట్టినా, మంత్రిగా మారినా, ఆర్థికంగా బాగా స్థిరపడ్డప్పటికీ, వారిపిల్లలకు రిజర్వేషన్లు కావాలనే కోరుతున్నారు. ఈ విధానంలో మార్పురావాలి. నిజమైన పేదలకు చేయూత ఇచ్చే విధంగా రిజర్వేషన్ల విధానం ఉండాలి.

- జి. బస్వంత్‌రెడ్డి సామాజిక విశే్లషకుడు