ఫోకస్

రాజకీయ కోణంలో చూడొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన ముస్లిం, మైనారిటీలకు రిజర్వేషన్లు కల్పించాల్సిన అత్యంత అవశ్యకత ఉంది. ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించే అంశాన్ని రాజకీయ కోణంలో చూడరాదు. అన్ని రంగాల్లోనూ వెనుకబడిన ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించాలని సచార్ వంచి అనేక కమిషన్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సిఫార్సు చేశాయి. ముస్లింలకు రిజర్వేషన్లు కల్పిస్తే రాజకీయంగా లాభపడవచ్చని బిజెపి ఎదురు చూస్తున్నది. ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించడమనేది మత పరంగా చూడరాదు. బట్టలు ఉతికే దోబీకి రిజర్వేషన్లు కల్పిస్తున్నప్పుడు అదే వృత్తి చేసుకుని జీవనం సాగించే పేద ముస్లింలకు ఎందుకు ఇవ్వరని అడుగుతున్నాం. రాజ్యాంగం ప్రకారం మతపరమైన రిజర్వేషన్లు కల్పించేందుకు వీలు కాదన్న వాదన ఉంది. మతపరమైన రిజర్వేషన్లు కల్పించాలని మేము కోరడం లేదు. అన్ని రంగాల్లో వెనుకబడిన ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించాలని కోరుతున్నాం. లేదంటే వృత్తిపరమైన రిజర్వేషన్లు కల్పించండి. వెనుకబడిన ముస్లింలకు చేయూత నివ్వాలని, మానవతా ధృక్పథంతో చూడాలని కోరుతున్నాం. నాడు అక్బర్, బాబర్ పాలనలోనూ హిందు-ముస్లింలను వేర్వేరుగా చూడలేదు. వారు ప్రతి ఒక్కరి బాగోగుల కోసమే కృషి చేశారు. ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ తన పాలనలో నగర పోలీసు కమిషనర్‌గా వెంకట్రామ్ రెడ్డిని నియమించారు. ప్రధానిగా హిందువైన మహారాజ్ కిషన్ ప్రసాద్ బాధ్యతలు నిర్వర్తించారు. ఇలా ముస్లింలు కాని వ్యక్తులకూ పదవులు ఇచ్చి గౌరవించిన దాఖలాలు ఉన్నాయి. కాబట్టి ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడి ఉన్న ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించాల్సిన అవశ్యకత ఉంది. ఆ దిశగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తీసుకుంటున్న చర్యలను మేము స్వాగతిస్తున్నాం.

- హామీద్ హుస్సేన్ శుత్తారీ అధ్యక్షుడు, అఖిల భారత సున్నీ ఉలేమా బోర్డు