ఫోకస్

రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మత పరమైన రిజర్వేషన్లు రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధం. వీటివల్ల సామాజిక విభజన జరుగుతుంది. అదే తరుణంలో మతం మార్పిడులకు దారితీస్తుంది. ఇటువంటి రిజర్వేషన్లను బిజెపి వ్యతిరేకిస్తుంది. రిజర్వేషన్లు అనేవి సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకే పరిమితం కావాలి. ఆన్ని రంగాల్లోను వివక్షకు గురైనవారు రిజర్వేషన్ల ద్వారా లబ్ధిపొంది, భవిష్యత్‌లో వారు ఎదిగేందుకు దోహదం చేస్తాయి. రాజ్యాంగ స్ఫూర్తికి, నిబంధనలకు లోబడే రిజర్వేషన్లు ఉండాలి. ముస్లిం రిజర్వేషన్లపై రాజకీయ పార్టీలు ఇస్తున్న హామీలు, ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరచడం వంటి చర్యలు ఆయా పార్టీల వ్యక్తిగతం. ఆచరణలోకి వచ్చేసరికి రాజ్యాంగ బద్ధంగానే రిజర్వేషన్లుంటాయ. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ముస్లింలకు రిజర్వేషన్లు కల్పిస్తూ తీసుకున్న నిర్ణయంపై సుప్రీం కోర్టు స్పష్టమైన తీర్పునిచ్చిందన్న విషయం గుర్తుంచుకోవాలి. తెలంగాణ కూడా ముస్లిం రిజర్వేషన్ల విషయంలో ఒక ఆలోచనతో ఉంది. మరో వ్యాజ్యం సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉంది. ఇప్పుడు ముస్లింలకు ప్రత్యేక రిజర్వేషన్లు అన్న అంశం కోర్టు తీర్పుకు లోబడే ఉండాల్సి ఉంటుంది. రాజకీయ పార్టీల ఎన్నికల హామీలు ఆయా వర్గాలను మభ్యపెట్టేందుకే. రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్లపై కొన్ని నిబంధనలున్నాయి. పరిమితికి మించి రిజర్వేషన్లు కూడా సహేతుకం కాదు. కొన్ని వర్గాలను కొత్తగా రిజర్వేషన్ పరిధిలోకి తీసుకురావాలన్న నిర్ణయం కూడా రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగానే జరగాల్సి ఉంటుంది. అయితే మత పరమైన రిజర్వేషన్ల అంశం తెరపైకి వస్తే మాత్రం అది ఓట్‌బ్యాంకు రాజకీయాలుగా పరిగణించాల్సిందే. తమ పరిధిలో లేని అంశాలను రాజకీయ పార్టీలు లేవనెత్తడం, తద్వారా ఆయా వర్గాలను తమకు అనుకూలంగా మలచుకుంటూ, ఇతర రాజకీయ పార్టీలను లక్ష్యంగా చేసుకోవడం బాధాకరం. ఈ విషయంలో బిజెపి కూడా రాజ్యాంగ పరిధికి లోబడే వ్యవహరిస్తుందనడంలో సందేహం లేదు.

-కంభంపాటి హరిబాబు, బిజెపి ఎపి రాష్ట్ర అధ్యక్షుడు