ఫోకస్

ఎత్తుగడగా ఉండరాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రైతులకు రుణమాఫీ హామీ ఇస్తే కచ్చితంగా అధికారంలో ఉన్న ప్రభుత్వాలు నిలుపుకోవాలి. లేదంటే రైతుల ఆత్మహత్యలు పెరుగుతాయి. మన దేశంలోరైతాంగ సమస్యల పరిష్కారానికి జాతీయ, రాష్ట్ర స్ధాయిలో సమగ్రమైన విధి విధానాలు లేవు. వ్యవసాయానికి సాగునీరు లేదా సమృద్ధిగా భూగర్భజలాలు, ఉచిత కరెంటు ఉంటే రైతుల కష్టాలు ఒక మేరకు గట్టెక్కుతాయి. ఆ తర్వాత వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు ఉండాలి. ఇక్కడే రైతులు మార్కెట్‌యార్డుల్లో దళారుల చేతుల్లో దోపిడీకి గురవుతున్నారు. ఏళ్లతరబడి అతివృష్టి, కరవుపరిస్ధితుల వల్ల రైతులురుణభారంతో సతమతమవుతున్నారు. ఏపిలో చంద్రబాబు ప్రభుత్వం 2014 అసెంబ్లీ ఎన్నికల్లో రుణాలను మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. అధికారం వచ్చిన తర్వాత చంద్రబాబు మొత్తం రుణాలు ఒక లక్ష కోట్లు ఉంటే, ఇంతవరకు ఏ మేరకు రుణాలను మాఫీ చేశారు. రైతాంగం రుణ మాఫీకి బ్యాంకులు సహకరించడం లేదు. అలాగే రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా అనుకూలంగా లేదు. పారిశ్రామిక రంగంలో బకాయిలున్న వారిని పట్టించుకోరు. అదే రైతుల ఆస్తులను బ్యాంకులు జప్తు చేస్తున్నాయి. యుపిలో బిజెపి ప్రభుత్వం రూ.36వేల కోట్ల రుణాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ హామీని పూర్తిగా నిలబెట్టుకుని రైతులకు ఉపశమనం కలిగించాలి. అలాగే కేంద్రం కూడా అన్ని రాష్ట్రాల్లో రుణాల మాఫీకి చొరవ తీసుకోవాలి. రైతులకు ఆధునిక వ్యవసాయంలో శిక్షణ, రుణాలు ఇవ్వడం, పంటలకు మద్దతు ధర, ఉచిత విద్యుత్, పంటలకు సాగునీటి సరఫరా కల్పించాలి. రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు లోక్‌సభ, శాసనసభలో చర్చించి రైతులను ఆదుకునేందుకు సమగ్ర ఆధునిక వ్యవసాయ విధానం తేవాలి.

-విశే్వశ్వరరెడ్డి, వైకాపా శాసనసభాపక్ష ఉపనేత, ఏపి