ఫోకస్

కోటి ఎకరాలు మాగాణిగా మారుతుంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ కోటి ఎకరాల మాగాణగా మార్చాలనేది ముఖ్యమంత్రి కెసిఆర్ లక్ష్యం. ఆ లక్ష్య సాధనకు చిత్తశుద్ధితో కృషి జరుగుతోంది. గత పాలకులు తెలంగాణ రైతాంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. కాకతీయుల కాలంలోనే దేశానికి ఆదర్శంగా నిలిచిన గొలుసు కట్టు చెరువులను పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. తెలంగాణ ఆవిర్భావం తరువాత మొట్ట మొదటగా రైతాంగం పైనే ప్రభుత్వం దృష్టిసారించింది. మాటలు కాకుండా చేతల్లో చూపించింది. 17వేల కోట్ల రూపాయల పంట రుణమాఫీ హామీని పూర్తిగా అమలు చేసి చూపించాం. నాలుగవ విడత బకాయిలు 11వ తేదీన విడుదల చేయడం ద్వారా రుణమాఫీ సంపూర్ణంగా అమలు చేసిన ప్రభుత్వంగా నిలిచింది.
రైతుల ఆత్మహత్యలు నిలిచిపోవాలన్నా, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మెరుగు పడాలన్న తపన ప్రభుత్వానిది. దీని కోసం దీర్ఘకాలిక, స్వల్పకాలిక వ్యూహాలు అమలు చేస్తున్నాం.
రాష్ట్రంలోని 46వేల చెరువులను దశల వారిగా పూడిక తీసివేసే పనులు చేపట్టాం. ఇప్పటికే దాదాపు 11వేల చెరువుల్లో పనులు పూర్తయి ఆ ప్రాంతాల్లో చెరువులు మంచినీటితో కలకలలాడుతున్నాయి. చెరువు కింద పంట పొలాలు పచ్చగా మారాయి. ఈసారి ఖరీఫ్‌లో దాదాపు 37లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండింది. ఇదో రికార్డు.
ప్రతి పంటకు సాగు నీటిని అందించే విధంగా ప్రాజెక్టులకు రూపకల్పన జరుగుతోంది. ఏటా బడ్జెట్‌లో ప్రాజెక్టులకు 25వేల కోట్ల రూపాయలను కేటాయించడం ద్వారా ప్రాజెక్టులపై ప్రభుత్వ చిత్తశుద్ధి స్పష్టమవుతోంది. ప్రాజెక్టుల రీ డిజైనింగ్ ద్వారా కోటి ఎకరాలకు సాగునీటిని అందించే ప్రయత్నాలు వేగంగా జరుగుతున్నాయి. రైతులకు తమ పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించడమే కాకుండా, గిట్టుబాటు ధరలు వచ్చేంత వరకు నిల్వ చేసుకోవడానికి 17 లక్షల మెట్రిక్ టన్నుల సామర్ధ్యం కలిగిన గోదాములను ప్రభుత్వం నిర్మించింది. 17వేల కోట్ల రూపాయల రుణమాఫీ హామీ ఇవ్వడమే కాదు దేశంలో అమలు చేసి చూపించిన ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. మార్క్‌ఫెడ్ ద్వారా ఈసారి 13లక్షల టన్నుల కందులను సేకరించాం.
ప్రాజెక్టులు నిర్మిస్తుంటే ఒకవైపు కేసులు వేస్తున్న విపక్షాలు మరోవైపు రైతులపై ప్రేమ కురిపిస్తున్నారు. ప్రజలకు వాస్తవాలు అన్నీ తెలుసు అందుకే రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా టిఆర్‌ఎస్‌పైనే ప్రజలు నమ్మకం చూపిస్తున్నారు. ఆరు దశాబ్దాల పాటు అధికారంలో ఉండి ప్రాజెక్టుల ఊసెత్తని విపక్షాలు రెండున్నర ఏళ్ల టిఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టులు నిర్మించకుండా ఏ విధంగా అడ్డంకులు కల్పించాలని ప్రయత్నిస్తున్నారో ప్రజలకు తెలుసు. కోటి ఎకరాలకు సాగునీరు లభించిన తరువాత బంగారు తెలంగాణ సాకారం అయి తీరుతుంది. కొన్ని జిల్లాల్లో ఈ ప్రభావం ఇప్పటికే కనిపిస్తోంది.

-పల్లా రాజేశ్వర్‌రెడ్డి టిఆర్‌ఎస్ ఎమ్మెల్సీ శాసన మండలిలో ప్రభుత్వ విఫ్