ఫోకస్

రుణమాఫీలో ఆదర్శం ఏపి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌లో చేపట్టిన రుణమాఫీ ప్రక్రియ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది. ఎటువంటి సమస్యలు లేని రాష్ట్రాలు సైతం చేపట్టలేని రుణమాఫీని విభజన వలన ఎంతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌లో సమర్థవంతంగా అమలుచేస్తున్నాం. దీనిద్వారా ఇతర రాష్ట్రాలకు ఆంధ్రప్రదేశ్ మార్గదర్శకమైంది. నీతి ఆయోగ్, రిజర్వ్ బ్యాంక్ రుణ మాఫీ సరికాదని చెప్పినా, కేంద్రం తనకు సంబంధం లేదని తేల్చిచెప్పినా, 54లక్షల బ్యాంకు ఖాతాలకు రూ.24వేల కోట్ల మేర రుణమాఫీ జమ చేసి ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నాం. తెలంగాణలోనూ, ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లోనూ రైతు రుణమాఫీ ప్రక్రియ చేపట్టడం వెనుక చంద్రబాబునే ఆదర్శంగా తీసుకున్నారు. ప్రతిపక్ష నేత జగన్ రైతు రుణమాఫీ సాధ్యం కాదని హేళన చేసినప్పటికీ, తెలుగుదేశం ప్రభుత్వం చేసి చూపించింది. రైతు రుణమాఫీ వల్ల లబ్ధిపొందినవారిలో తెలుగుదేశం, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీతోపాటు ఇతర పార్టీల వారు కూడా ఉండడం, మా ప్రభుత్వ పారదర్శకతకు నిదర్శనం. 16వేల కోట్ల లోటు బడ్జెట్‌లో ఉన్న రాష్ట్రంలో వేలకోట్ల రుణ మాఫీ చేసిన ఘనత గతంలో ఏ రాష్ట్రంలోనూ జరగలేదు. రుణమాఫీతోనే సరిపెట్టుకోకుండా రైతులు పండించే పంటకు సరైన గిట్టుబాటు ధరను కల్పించే చర్యలకు ఉపక్రమిస్తూ, వ్యవసాభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసి, దాని ప్రకారం ముందుకు వెళుతున్నాం. రైతుల అభివృద్ధే రాష్ట్భ్రావృద్ధి అని నమ్మి, వ్యవసాయ రంగంలో ఆధునిక పరిజ్ఞానాన్ని అమలు చేసి, వ్యవసాయాభివృద్ధి తద్వారా రాష్ట్భ్రావృద్ధి సాధించడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం.
ఇక రైతుల ఆత్మహత్యల విషయానికి వస్తే, కల్తీ విత్తనాలు, కరవు పరిస్థితులు తదితర కారణాల వల్ల పంటకు నష్టం జరిగి కొన్నిచోట్ల ఆత్మహత్యలకు పాల్పడిన సంఘటనలు గతంలో చాలా జరిగాయి. అయితే ప్రస్తుతం ఏ రైతుకూడా ఎటువంటి కారణాలతోనూ ఆత్మహత్యకు పాల్పడకూడదనే ఉద్దేశంతో ప్రణాళికాబద్ధమైన సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబోతున్నాం. కల్తీ విత్తనాలు, ఎరువుల వలన రైతులు నష్టపోతే, అటువంటి కంపెనీలు, సంస్థలు, దుకాణాలపై కఠిన చర్యలు తీసుకుంటున్నాం. కల్తీకి పాల్పడిన వ్యక్తులు ఎంతటివారైనా ఉపేక్షించే ప్రసక్తే లేదు. ప్రభుత్వ విధానాల వల్ల ఏ విధమైన అభ్యంతరాలు ఉన్నా, తెలియజేయాలని కూడా రైతు సంఘాలను ఆహ్వానిస్తున్నాం.

-సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి, ఆంధ్రప్రదేశ్