ఫోకస్

రుణమాఫీయే పరిష్కారమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనేక రాష్ట్రాలకు ఎన్నికల తాయిలంగా మారిన రుణమాఫీ పథకం అమలుపై బ్యాంకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ దాదాపు 24, 500 కోట్ల మేర రుణమాఫీ ప్రకటించగా, తెలంగాణ ప్రభుత్వం 17వేల కోట్లు రుణమాఫీ ప్రకటించాయి. ఇటీవల ఎన్నికల్లో విజయం సాధించిన ఉత్తరప్రదేశ్ బిజెపి ప్రభుత్వం 36వేల కోట్ల మేర రుణమాఫీకి సిద్ధమైంది. అనునిత్యం పంట రుణాలని ప్రభుత్వాలు మాఫీ చేస్తే రైతులు తాము తీసుకున్న పంట రుణాలు ఎగవేయడానికి వ్యూహాత్మకంగా ప్రాధాన్యం ఇస్తారని బ్యాంకర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కార్పొరేట్ సంస్థలు పారిశ్రామిక ప్రగతి పేరిట తీసుకుంటున్న రుణాలతో లబ్ది పొందినా దివాళా పేరిట లక్షల కోట్ల మేర రుణమాఫీకి ప్రభుత్వాలు, బ్యాంకులు ముందుకు వస్తున్నాయనే వాస్తవంతో సరిపోల్చుకుంటున్నవారంతా ఈ విరుద్ధ భావనను ప్రశ్నిస్తున్నాయి. యావత్ దేశానికి అవసరమైన వ్యవసాయ ఉత్పత్తులు పండించి అందుబాటులోకి తెచ్చే రైతులకు ఇచ్చే రుణ మాఫీ ప్రతికూల పరిణామాలకు దారితీస్తుందని ఆర్ధిక నిపుణులు, బ్యాంకర్లు చెప్పడం దారుణమనేది నిర్వివాదాంశం. రుణ మాఫీ పరిష్కారం కాదంటున్న నిపుణులు వ్యవసాయ రంగానికి ప్రభుత్వ మద్దతు అవసరమే కాని, పంట రుణాల మాఫీ పరిష్కారం కాదని ఆర్ధిక నిపుణులు స్పష్టం చేస్తున్నారు. రుణమాఫీ అమలు వల్ల వ్యవసాయ రంగంపై ప్రభుత్వ వ్యయం తగ్గిపోవడమేకాదు, పెట్టుబడులు , నీటిపారుదల- నీటి పొదరు, నీటి కొరత నివారణ, మార్కెట్‌తో అనుసంథానం, వ్యవసాయ పరిశోధనా అంశాలపైనా ప్రతికూల ప్రభావం చూపుతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ రంగానికి ఎదురవుతున్న సమస్యలు సంస్థాగతంగా ఉన్నవే తప్ప దీర్ఘకాలిక పరిష్కారం ఎవరూ కనుగొనడం లేదు. ఇలాంటి సమయంలో రుణమాఫీ మరింత సంక్లిష్ట సమస్యలకు దారితీస్తుందనేది ఆర్ధిక వేత్తల వాదన. 2014లో కేంద్రంలో నరేంద్రమోదీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 2022 నాటికి వ్యవసాయ రంగం ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చింది. అయితే తాజా పరిణామాలు అందుకు సానుకూలంగా లేవనేది నిర్వివాదాంశం. దేశ స్థూల జాతీయోత్పత్తిలో వ్యవసాయం వాటా 15 శాతం. దేశ జనాభాలో ఎక్కువ మంది వ్యవసాయ రంగంపై ఆధారపడిన వారే, భారీగా శక్తిమంతంగా ఉన్న రైతుల ఓటు బ్యాంకును కొల్లగొట్టేందుకు స్వల్పకాలికంగా రాజకీయ పార్టీలకు రుణమాఫీ పథకం ఒక అస్త్రంగా మారిందని ఇటీవలి యుపి ఎన్నికల ఫలితాలే తేటతెల్లం చేస్తున్నాయి. దీర్ఘకాలంలో వ్యవసాయ రంగానికి ఇది లబ్ది చేకూరుస్తుందా అనేది అనుమానమే. పంట రుణాల మాఫీ వల్ల రుణ క్రమశిక్షణపై ప్రతికూల ప్రభావం చూపుతుందని ఎస్‌బిఐ చైర్‌పర్సన్ అరుంధతి భట్టాచార్య అంటున్నారు. రాజకీయంగా దీనిని ఎవరూ సీరియస్‌గా తీసుకోకపోయానా మహారాష్ట్ర అసెంబ్లీలో విపక్ష నేత మాత్రం ఆమెపై శాసనసభా హక్కుల నోటీసు ఇచ్చారు. గతంలో ఎస్‌బిఐ చైర్ పర్సన్‌గా ఉన్న ప్రదీప్ చౌదరి సైతం రుణ మాఫీతో నైతిక ప్రమాణాలకు విపత్తు తెచ్చిపెడుతుందని పేర్కొన్నారు. ఆర్‌బిఐ మాజీ గవర్నర్ రఘురాం సైతం రుణమాఫీ వల్ల రుణ పరపతిపైనా, క్రెడిట్ మార్కెట్‌పైనా ప్రతికూల ప్రభావం పడుతుందని వాదిస్తున్నారు. ప్రపంచబ్యాంకు కూడా రుణమాఫీ అంశంపై ఒక నివేదిక ఇచ్చింది. పెట్టుబడులు పెట్టేందుకు గానీ, లేబర్ మార్కెట్‌పైనా సానుకూల ప్రభావాన్ని రుణమాఫీ చూపలేకపోయిందనేది ఈ నివేదిక సారాంశం. ఈ క్రమంలో రుణమాఫీపై నిపుణుల అభిప్రాయాలు ఈ వారం ఫోకస్‌లో...