ఫోకస్

ఆరోపించినవారే రుజువు చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇటీవల ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఎన్నికల్లో వినియోగించిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లలో అక్రమాలు చోటుచేసుకున్నాయని వచ్చిన ఆరోపణల నేపథ్యంలో దేశవ్యాప్తంగా కొందరికి సందేహాలు రావచ్చు. అయితే ఈ ఆరోపణలు చేసిన వారే రుజువు చేయాలి. ఉత్తరప్రదేశ్ ఎన్నికలే కాదు దేశవ్యాప్తంగా కొన్ని రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో ఓటింగ్ మిషన్లు ట్యాంపరింగ్, జంపింగ్ విధానాన్ని అమలు జరిపే సాఫ్ట్‌వేర్ పరికరంతో బిజెపి మెజార్టీ స్థానాలు గెలుచుకుందని పత్రికల్లో చూశాం. కానీ అది ఎలా సాధ్యమవుతుంది? అలా చేస్తే ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్టవుతుంది. ఇవిఎంలలో మోసం జరిగిందంటూ ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ చేసిన సవాల్‌ను స్వీకరించిన కేంద్రంలోని బిజెపి ప్రభత్వం ఆ అనుమానాలను నివృత్తి చేయాల్సిన అవసరం ఉంది. ఉత్తర భారతంలో జరిగిన ఎన్నికల్లో బిజెపికి ఏకపక్షంగా ఓట్లు వచ్చాయని, ఇది అధికార దుర్వినియోగమని, ఇవిఎంలలో సెట్ చేసిన సాఫ్ట్‌వేర్ ప్రభావమేనంటూ పలు పార్టీలు ఆరోపిస్తున్నాయి. దీనిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నాయి. అయితే వీరి డిమాండ్‌లో స్వార్థమెంత? ఆరోపణల్లో వాస్తవమెంత? అన్నది కేంద్రమే స్పష్టం చేయాలి. ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలలో అవకతవకలు జరుగలేదని అనుకుంటున్నాను. ఒక వేళ జరిగితే..అది తప్పే. ప్రతిపక్షాల ఆరోపణలు, అనుమానాలను నివృత్తి చేయాలి.

- జగన్‌మోహన్ మెట్ల లోక్‌సత్తా, తెలంగాణ కన్వీనర్