ఫోకస్

నరేంద్ర మోదీపై బురదజల్లే యత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓటింగ్ యంత్రాలను ట్యాంపరింగ్ చేయడం ద్వారానే బిజెపి అఖండ విజయాలు నమోదు చేసుకుంటోందన్న ప్రచారం వాస్తవ విరుద్ధం. ఉత్తరప్రదేశ్‌సహా మూడు రాష్ట్రాల్లో బిజెపి విజయంతోనే కాంగ్రెస్ ఈ వాదనకు తెరతీసింది. ఆడలేక మద్దెల ఓడు అన్నట్టు కాంగ్రెస్‌వాళ్లు ఇటువంటి ఆరోపణలకు దిగుతున్నారు. 2004లో కాంగ్రెస్ పార్టీ తొలిసారిగా ఇవిఎంలను ప్రవేశపెట్టింది. అప్పుడు బిజెపి అధికారంలోకి రాలేదు. గత మూడేళ్లుగా పలు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికలనే తీసుకుంటే కొన్నిచోట్ల బిజెపి పరాజయాలను నమోదు చేసుకుందన్న విషయం గుర్తుంచుకోవాలి. కేంద్రంలో బిజెపి అధికారం చేపట్టిన తరువాత ప్రతిష్ఠాత్మకంగా జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అమ్ ఆద్మీ పార్టీ (అప్) విజయం సొంతం చేసుకుంది. అనంతరం జరిగిన బీహార్ ఎన్నికల్లో బిజెపి ఓటమి పాలైంది. తాజాగా జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి పంజాబ్‌లో కాంగ్రెస్ విజయం సాధించలేదా? పంజాబ్‌లో అకాలీదళ్, బిజెపి కలిసి పోటీచేస్తే మూడోస్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక్కడ ఘనవిజయాన్ని నమోదు చేసుకుని ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టిన అమరీందర్ సింగ్ ఇవిఎంలపై చేసిన వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకోవాలి. ఇవిఎంలు ట్యాంపరింగ్ చేసుంటే తాను అధికారంలోకి వచ్చేవాడిని కాదని సాక్షాత్తు ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ పేర్కొనడం గమనార్హం. కాంగ్రెస్ అధికారంలో ఉండగా, అప్పటి కేంద్ర మంత్రి వీరప్పమొయిలీ ఎన్నికల్లో ఇవిఎంల వినియోగాన్ని ప్రవేశపెట్టారు. ఇవిఎంలను ట్యాంపరింగ్ చేసే అవకాశాలు లేవని కాంగ్రెస్ నాయకుడే చెప్పడం గుర్తుంచుకోవాలి. ఇవిఎంలను ట్యాంపరింగ్ చేసి ఎన్నికల ఫలితాలను అనుకూలంగా మార్చుకునే కుసంస్కారం బిజెపికి లేదు. ప్రధాని నరేంద్ర మోదీకి ప్రజాకర్షణ ఉంది. మూడేళ్ల మోదీ పాలనపై ప్రజలు సానుకూలంగా స్పందించడం ద్వారానే బిజెపి పలు రాష్ట్రాల్లో అధికారంలోకి రాగలిగింది. పదేళ్ల కాంగ్రెస్ పాలనపై విసుగుచెందిన దేశ ప్రజలు కాంగ్రెస్‌సహా ఆ పార్టీ మిత్రపక్షాలను ఓడించారు. విపక్షాల ఓటమికి ఇవిఎంలే కారణంగా ప్రచారం చేస్తూ బిజెపి కీర్తిపై బురదజల్లేందుకు కాంగ్రెస్ యత్నిస్తోంది. ఇది ఎంతమాత్రం సహేతుకం కాదు.

- కంభంపాటి హరిబాబు బిజెపి ఏపి రాష్ట్ర అధ్యక్షుడు