ఫోకస్

బ్యాలెట్ పేపర్‌ను పునరుద్ధరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇవిఎంపై ప్రజలకు నమ్మకం సన్నగిల్లుతోంది. మానవుని మేధస్సుకు అందనిది ఏదీలేదు. సాంకేతిక పరిజ్ఞానం బాగా పెరిగింది. మానవుడు చంద్రమండలంపైకి వెళ్ళడమే కాకుండా భూమండలం నుంచే చంద్ర మండలం అవతల ఉన్న గ్రహాలపై పరిశోధన చేసే గొప్పశక్తి, మేధాస్సుకు సంపాదించాడు. అటువంటి ఈ రోజుల్లో ఇవిఎంల ట్యాంపరింగ్ పెద్ద విషయమే కాదు... ఈ మాట నేనే కాదు ఇటీవల ఉత్తర్‌ప్రదేశ్ ఎన్నికల తర్వాత అనేకమంది మేధావులు, వివిధ పార్టీల నేతలు గొంతెత్తారు. అంతేకాదు ఈవిఎంల ట్యాంపరింగ్ ఎలా చేయవచ్చనేది ఇటీవల హరిప్రసాద్ అనే ఓ ఇంజనీర్ టివీలో ఒక కార్యక్రమంలో చూపించగా దేశ ప్రజలు చూసి విస్తుపోయారు. ఇవిఎంలో ఎవరికి ఓటు వేసినా తమకు కావాల్సిన అభ్యర్థి ఖాతాలోనే ‘జమ’ అవుతుంది. ఓటరుకు కేవలం ‘బీప్’ శబ్ధం వినిపిస్తుంది. తాను ఓటు వేశానన్న సంతృప్తితో పోలింగ్ కేంద్రం నుంచి బయటకు వచ్చేస్తాడు. కానీ ఫలితాలు చూసి జనం నివ్వెరపోతున్నారు. ఒక హోటల్‌లో లేదా పెట్రోలు బంకులో ఎటిఎం కార్డును వినియోగిస్తే, ఎంత బిల్లు చేశామో ‘స్లిప్’ ఇస్తారు. అటువంటిది ఓటు వేసిన తర్వాత తాను ఎవరికీ ఓటు వేశామో, కరెక్ట్‌గా ఓటు వేశామా అని తెలుసుకునేందుకు ‘స్లిప్’ ఎందుకు ఇవ్వరని అడుగుతున్నాను. 2013లో మా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే ఓటరుకు ‘స్లిప్’ ఇచ్చే విధానాన్ని తీసుకుని వచ్చేందుకు కృషి జరిగింది. ఖమ్మం మున్సిపాలిటీలో, దేశంలో ఒకటి, రెండుచోట్ల ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా చేపట్టినట్లు సమాచారం. ఇవిఎంల ట్యాంపరింగ్‌కు అవకాశం ఉందని చాలా కాలంగా అనుమానాలు, విమర్శలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. అది కాకుండా కౌంటింగ్ చేయడానికి గడువు ఉండడంతో ‘స్టోర్ (స్ట్రాంగ్) రూం’లో ఇవిఎంలను భద్రపరిచినప్పుడూ తారుమారు చేసేందుకూ అవకాశం ఉందన్న వాదన కూడా ఉంది.
ముఖ్యంగా నిరక్షరాస్యత అధికంగా ఉన్న మన దేశంలో ఇవిఎంల వినియోగం అంత ఫలితాన్ని ఇవ్వదనే చెప్పాలి. ఇవిఎంలు ఉపయోగించడం తెలియకపోవడంతో, అక్కడున్న అధికారిని అడిగినప్పుడు ఇలా నొక్కాలి అని వేలు చూపిస్తూ తనకు అభిమానం ఉన్న అభ్యర్థి పేరుపై బటన్ నొక్కడంతో ఓటు పడిపోతుంది. ఆ తర్వాత సదరు ఓటరు నొక్కినా ఫలితం ఉండదు. కానీ ఆ ఓటరు మాత్రం తాను ఓటు వేశానన్న తృప్తితో వెళతాడు. ఒక నిర్ణీత సంఖ్య తర్వాత ఎక్కువమంది అభ్యర్థులు పోటీలో ఉన్నట్లయితే రెండు, మూడు ఈవిఎంలు పెట్టడం కూడా కష్టమవుతుంది. ప్రజాస్వామ్యాన్ని పునాది అయిన ఎన్నికల విధానమే ఇంత అస్తవ్యస్థంగా ఉంటే ఎలా? కాబట్టి ప్రజలు సునాయాసంగా, తమకు నచ్చిన అభ్యర్థికి ఓటు వేసుకునేలా బ్యాలెట్‌నే పునరుద్ధరించాలని కోరుతున్నాను. దేశంలో మెజారిటీ ప్రజల అభిమతం కూడా అదే.

- డాక్టర్ శ్రవణ్ కుమార్ దాసోజు, ముఖ్య అధికార ప్రతినిధి తెలంగాణ పిసిసి