ఫోకస్

సందేహాలను నివృత్తి చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తమకు ఇష్టమైన పార్టీకి ఐదేళ్ల పాటు అధికారం ఇచ్చేందుకు ప్రజలు ఎన్నికల్లో ఓట్లు వేస్తారు. ఎన్నికల ఫలితాలను ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల ద్వారా రెండు గంటల్లో వెల్లడిస్తారు. ఐదేళ్ల పాటు ప్రజలకు సుపరిపాలన అందించే పార్టీ గెలుపుపై అనేక అనుమానాలు ఉంటాయి. గెలిచిన పార్టీ ఇది ప్రజా విజయమంటుంది. ఓటమి చెందిన పార్టీ మాత్రం మనదేశంలో గెలుపును అంగీకరించదు. గెలిచిన పార్టీని అభినందించడమనేది ఈ దేశ చరిత్రలో లేదు. అలాగే ఓటమిని హుందాగా ఒప్పుకోవడమనే మంచి సంస్కృతి లేదు. రిగ్గింగ్ చేశారని, ఇవిఎం అవకతవకల వల్ల అధికారంలోకి ఫలానా పార్టీ వచ్చిందనే విమర్శలు చేస్తారు. ప్రపంచంలో అత్యంత సంపన్నమైన అమెరికాలో కూడా ఇప్పటికీ బ్యాలెట్ పేపర్ ద్వారా ప్రజలు అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. మన దేశంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల వ్యవస్థ పటిష్టమైనదని, ఎవరూ ట్యాంపరింగ్ చేయలేరని ఎన్నికల సంఘం అనేకసార్లు ప్రయోగాత్మకంగా తెలిపినా ఓటమి చెందిన పార్టీ మాత్రం నమ్మదు. ఈ దశలో ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేసేందుకు రెండు మార్గాలున్నాయి. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలపై ఓటరు తనకు ఇష్టమైన పార్టీ గుర్తుపై బటన్ నొక్కడంద్వారా ఓటు వేస్తారు. అదే సమయంలో ఒక రశీదు కూడా ఇవ్వాలి. ఏ అభ్యర్థికి వేశారో ఆ రశీదు ఉంటుంది. ఆ రశీదును ఓటరు పక్కనే ఉన్న బ్యాలెట్ బాక్స్‌లో డిపాజిట్ చేయాలి. అంటే ఆ రశీదు బయటకు రాదు. దీనివల్ల ఇవిఎం కౌంటింగ్‌లో తేడా ఉంటే, రశీదులు ఉన్న బ్యాలెట్ పెట్టెను తెరిచి కౌంటింగ్ చేసి ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయో తెలుస్తుంది. రెండో పద్ధతి పాత విధానానికి వెళ్లాలి. బ్యాలెట్ పేపర్ల విధానం ప్రవేశపెట్టాలి. దీనివల్ల కౌంటింగ్ రెండు, మూడురోజులవుతుంది. అయినా ఫర్వాలేదు. కాని ఇందులో రిగ్గింగ్‌కు ఆస్కారం లేకుండా, బూత్‌లో దౌర్జన్యంగా ప్రవేశించి బ్యాలెట్ పేపర్లను లాక్కొని ఓట్లను వేసుకునే లోపాలు ఉన్నాయి. వీటిని నిరోధించేందుకు పటిష్టమైన పోలీసు భద్రత అవసరం. దేశంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల పనితీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. యుపిలో 325 సీట్లు బిజెపికి వచ్చాయి. ఇన్ని సీట్లు బిజెపికి ఎలా వస్తాయి? కచ్చితంగా ఎక్కడో అక్రమాలు జరిగాయని బిఎస్‌పి, ఎస్‌పి, కాంగ్రెస్ అంటున్నాయి. ఈ దేశంలో ఇవిఎం పద్ధతిని ప్రవేశపెట్టిన కాంగ్రెస్ పార్టీయే ఈ విధానం సరిగా లేదంటోంది. రాజకీయ పార్టీలు సమయానుకూలంగా తమ అభిప్రాయాలను మార్చుకోవడం దురదృష్టకరం. అందుకే ఏ విధానం ద్వారా ఓటర్లు ఓట్లు వేయడం, ఓట్లు లెక్కించడంపై కేంద్ర ఎన్నికల సంఘం అన్ని రాజకీయ పార్టీలు, పౌర సంఘాల అభిప్రాయాలను తెలుసుకోవాలి. దేశ వ్యాప్తంగా చర్చించాలి. మెరుగైన విధానాన్ని ఎంపిక చేసి అందరికీ ఆమోదయోగ్యమైన పద్ధతిని ఆచరించాలి.

- కె శివకుమార్ వైకాపా ప్రధాన కార్యదర్శి, తెలంగాణ శాఖ