ఫోకస్

అక్రమాలకు అవకాశం లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇవిఎంల వినియోగంలో అక్రమాలు జరిగే అవకాశం లేదు. సాధారణ ఎన్నికలైనా, స్థానిక సంస్థల ఎన్నికలైనా, ఉపఎన్నికలైనా.. ఇలా ఏ ఎన్నికలైనా సరే.. పోలింగ్‌కోసం మనం ఇవిఎంలను వాడుతున్నాం. తాజాగా ఇవిఎంల వినియోగంలో కొన్ని మార్పులు వచ్చాయి. పోలింగ్ సందర్భంగా ఓటరు ఎవరికి ఓటు వేశారో తెలుసుకునేందుకు ఇవిఎంతోపాటు వివిప్యాట్ (ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రేల్) పరికరాన్ని బిగించాల్సి ఉంటుంది. వివిప్యాట్‌లు బిగించడంవల్ల ఓటర్ ఎవరికి ఓటు వేశారో తెరపై కనబడుతుంది (డిస్‌ప్లే). అవసరమైతే ప్రింట్ కూడా తీసుకోవచ్చు. ఈ విధానాన్ని మేము (రాష్ట్ర ఎన్నికల సంఘం) ఇటీవల జరిగిన ఖమ్మం మున్సిపల్ ఎన్నికల్లో వినియోగించాం. మంచి ఫలితాలు లభించాయి.
ఇవిఎంలపై ఎవరు కూడా అపోహలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. వీటి వినియోగంలో ఏవో అక్రమాలు జరిగిపోతున్నాయంటూ ఇతర రాష్ట్రాల్లో అనుమానాలు తలెత్తాయి. మన రాష్టమ్రైనా, ఇతర రాష్ట్రాలైనా ఇవిఎంల వినియోగం ఒకే విధంగా ఉంటుంది. ఇవిఎంలను తయారు చేస్తున్నది ప్రభుత్వ రంగ సంస్థలే. ఇసిఐఎల్ (ఎలక్ట్రానిక్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్) తోపాటు బిఇఎల్ (్భరత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్) సంస్థలు ఇవిఎంలను సరఫరా చేస్తున్నాయి. ఈ రెండు కూడా భారత్‌లోనే కాకుండా అంతర్జాతీయంగా సమర్థత కలిగిన సంస్థలుగా పేరు తెచ్చుకున్నాయి. ఈ సంస్థల నుండి అనేక దేశాలు ఎలక్ట్రానిక్ పరికరాలను కొనుగోలు చేస్తున్నాయి. అలాంటి ప్రతిష్టాత్మకమైన సంస్థలు రూపొందిస్తున్న ఇవిఎంలు ఎట్టి పరిస్థితిలోనూ ‘ట్యాంపరింగ్’ చేసేందుకు అవకాశం ఉండదు. బిఇఎల్, ఇసిఐఎల్ తొలుత పరిశోధన-అభివృద్ధి (రీసర్చ్ అండ్ డెవలప్‌మెంట్-ఆర్ అండ్ డి) విభాగం ద్వారా అన్ని కోణాల్లో ఇవిఎంల పనితీరును పరిశీలిస్తాయి. ట్యాంపరింగ్ చేసేందుకు అవకాశం లేని విధంగా వీటిని రూపొందిస్తాయి. ఇవిఎంలను ఎన్నికల సంఘానికి లేదా కేంద్ర ఎన్నికల కమిషన్‌కు సరఫరా చేసిన తర్వాత మేము (అధికార యంత్రాంగం) క్షుణ్ణంగా పరిశీలిస్తాం. ఓటరు ఎవరికైతే ఓటు వేస్తాడో, ఆ ఓటు సదరు అభ్యర్థికే పడుతోందా... లేదా? అన్న అంశాన్ని పరిశీలిస్తాం. ఈ అంశంపై అధికారిక సిబ్బందితోపాటు రాజకీయ పార్టీల నేతలను కూడా ఆహ్వానించి వారిముందే ఇవిఎంలను పరిశీలిస్తాం. ఇవిఎంలను పోలింగ్ కేంద్రానికి పంపించిన తర్వాత సంబంధిత అధికారి చెక్‌చేస్తారు. పోటీచేస్తున్న అభ్యర్థుల ఏజంట్ల ముందు తొలుత ఉపయోగించి చూపిస్తారు. ఒకరికి ఓటువేస్తే మరొకరికి ఓటు నమోదు అయ్యే అవకాశం ఏమాత్రం ఉండదు. ఈ విషయాన్ని రూఢీ చేసుకున్న తర్వాత ఇవిఎంలను సీల్ చేసి వినియోగిస్తారు. ఇంత పకడ్బందీగా ఇవిఎంలను వినియోగించినా వాటిపై అనుమానాలు వ్యక్తం చేయడం సరైన విధానం కాదు.

- వి. నాగిరెడ్డి, కమిషనర్, తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం