ఫోకస్

వెనక్కి వెళ్లలేం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓటింగ్ యంత్రాలను ట్యాంపరింగ్ చేయవచ్చు అని వాదించడమే కాకుండా టీవిల సమక్షంలో నిరూపించాను. సాంకేతిక నిపుణునిడిగా ఇవిఎంల గురించి నాకు అవగాహన ఉంది. ఏ విధంగా ట్యాంపరింగ్ చేయవచ్చునో టీవిల సాక్షిగా నిరూపించాను. నాతోపాటు కొందరు సాంకేతిక నిపుణులు కూడా నిరూపించారు. ఇవిఎంలలో ఎలాంటి లోపాలు ఉన్నాయో ఆ రోజు మేం చెప్పాం. మాలాంటి కొందరు లోపాలను బయటపెట్టిన తరువాత ఇవిఎం యంత్రాల్లో ఆ లోపాలను సరి చేశారు. ఇప్పుడు ఇవిఎంలు ట్యాంపరింగ్‌కు అవకాశం లేకుండా పని చేస్తున్నాయి. ఇవిఎంలను ట్యాంపరింగ్ చేసి చూపించమని ఎలక్షన్ కమీషన్ సవాల్ చేస్తే ఎవరూ స్పందించలేదు. క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు ఉపయోగించినప్పుడు రసీదు వచ్చినట్టుగా, ఇవిఎంలద్వారా ఓటు వేసినప్పుడు పేపర్ ట్రయిల్ ఇస్తే ఎలాంటి అనుమానాలు ఉండవు. పేపర్ ట్రయిల్‌కోసం మూడు వేల కోట్ల రూపాయల వ్యయం అవుతుందని, ఆ నిధులు విడుదల చేయాలని ఎన్నికల కమీషన్ కోరింది. 17లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఉన్న దేశంలో మూడువేల కోట్ల వ్యయాన్ని భరించడం కష్టం కాదు. ఆ నిధులను విడుదల చేయడంద్వారా ఇవిఎంలపై మరింత నమ్మకం పెరుగుతుంది. ఏ పార్టీకి ఓటు వేశారో రసీదు రావడంవల్ల నమ్మకం పెరుగుతుంది, తప్పు జరిగే అవకాశం లేకుండా పోతుంది. ఇవిఎంలను దేశంలో మొదటిసారి ప్రవేశపెట్టింది బిజెపి కాదు. రాజీవ్ గాంధీ హయాంలో దేశంలో ఈ టెక్నాలజీ ఉపయోగంలోకి తెచ్చారు. అనంతరం యుపిఏ ప్రభుత్వం ఇవిఎంలను ఎన్నికల్లో ఉపయోగించింది. యుపిఏ అనంతరమే బిజెపి ప్రభుత్వం ఉపయోగిస్తోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తొలుత ఇవిఎంలను ఉపయోగించడానికి ఉత్సాహం చూపించారు. ఐటి, డిజిటల్ అంశాల్లో లీడ్ తీసుకోవడానికి ఉత్సాహం చూపించారు. ఢిల్లీలో 70 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా, 67 నియోజకవర్గాల్లో ఆమ్ ఆద్మీ గెలిచింది. ఇవిఎంల ద్వారానే అప్పుడు ఎన్నికలు జరిగాయి. ఆమ్ ఆద్మీ గెలిచినప్పుడు ఇవిఎంలపై అనుమానం లేదు. కానీ ఇప్పుడు బిజెపి గెలిచి తాము ఓడిపోగానే ఇవిఎంలపై అనునాలు వ్యక్తం చేస్తున్నారు. ఇవిఎంలద్వారా అప్పటికప్పుడు ఫలితాలు తెలుస్తాయి. బ్యాలెట్ పేపర్ల ద్వారా గంటల తరబడి ఓట్లు లెక్కించేవారు. పెద్దమొత్తంలో పేపర్లు కూడా వృధా అవుతాయి. మనుషులు, మానవ నిర్మితమైన యంత్రాల్లో చిన్న చిన్న లోపాలు ఉంటే ఉంటాయి. వాటిని సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్లాలి. సాంకేతికంగా ఎంతో ముందుకువెళుతున్న కాలంలో వెనక్కి వెళ్లలేం. లోపాలు ఉంటే సవరించుకోవాలి. ఇవిఎంలను ట్యాంపరింగ్ చేసి అధికారంలోకి వచ్చే అవకాశం ఎంతమాత్రం లేదు.

- త్రిపురనేని హనుమాన్ చౌదరి ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వ ఐటి సలహాదారు అధ్యక్షుడు, ప్రజ్ఞ్భారతి