ఫోకస్

ఇవిఎంల విశ్వసనీయత ఎంత?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశంలో సజావుగా, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించేందుకు గత 60 ఏళ్లలో ఎన్నో సంస్కరణలు అమలులోకి వచ్చాయి. ఎన్నికల అక్రమాలను నిరోధించడం, అర్హులైన అభ్యర్థులనే ప్రజాసేవకులుగా చట్టసభలకు పంపించడం లక్ష్యంగా ఈ సంస్కరణలు చేపట్టారు. అయితే ఎన్ని సంస్కరణలు వచ్చినా కొన్నిచోట్ల కులం, మతం, వర్గం ప్రాబల్యంతోపాటు ధన ప్రభావం, అక్రమ పోలింగ్ కూడా కనిపిస్తూనే ఉంది. దీనిని సైతం అడ్డుకట్టవేయడానికి 2004లో తొలిసారి ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఇవిఎం) వినియోగం అమలులోకి వచ్చింది.
ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత మరోమారు ఇవిఎంల పనితీరుపై వివిధ పార్టీల నేతలు అనుమానాలు వ్యక్తం చేశారు. ఇవిఎంలను ప్రయోగాత్మకంగా తొలుత పరిశీలించి, 2004 లోక్‌సభ సాధారణ ఎన్నికలలో ఉపయోగించారు. దేశమంతా అన్ని పోలింగ్ కేంద్రాల్లో నేడు ఇవిఎంలనే వినియోగిస్తున్నారు. ఇవిఎంలను ఎన్నికల సంఘం కోరడంతో రెండు ప్రభుత్వరంగ సంస్థలు బెంగళూరులోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌లు తయారుచేశాయి. ఒక్కో ఇవిఎంలోనూ సాధారణంగా ఒక బ్యాలెట్ యూనిట్, ఒక కంట్రోల్ యూనిట్ ఉంటాయి. ఎన్నికల్లో పోటీచేస్తున్న అభ్యర్థుల సంఖ్య 16 కంటే ఎక్కువగా ఉన్నపుడు ఒక కంట్రోల్ యూనిట్‌కు మరో బ్యాలెట్ యూనిట్‌ను చేర్చేందుకు కూడా వీలుంది. ఇలా గరిష్టంగా నాలుగు బ్యాలెట్ యూనిట్లను ఒక కంట్రోల్ యూనిట్‌కు చేర్చవచ్చు. రానున్న రోజుల్లో వోటర్ వెరిఫైయబుల్ పేపర్ ఆడిట్ ట్రయిల్ యూనిట్లు సేకరించే యోచనలో కూడా ప్రభుత్వం ఉంది. 2000-2005 సంవత్సరాల కాలంలో సేకరించిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు పాతబడిపోయాయి. ఒక్కో ఇవిఎం జీవిత కాలం 15 ఏళ్లు, దీంతో ఇప్పటికే మూడు లక్షలకు పైగా ఓటింగ్ యంత్రాలను క్రమంగా పక్కన పెట్టి కొత్తవాటితో ఎన్నికలు నిర్వహించేందుకు కూడా చర్యలు తీసుకుంటోంది. 2019లో నిర్వహించాల్సిన లోక్‌సభ సాధారణ ఎన్నికల అవసరాలను దృష్టిలో ఉంచుకుని అదే విధంగా కొన్ని రాష్ట్రాల విధాన సభలకు జరగాల్సిన ఎన్నికల అవసరాలను దృష్టిలో ఉంచుకుని కొత్తగా 5.50 లక్షల బ్యాలెట్ యూనిట్లను, 5.45 లక్షల కంట్రోల్ యూనిట్లను సేకరించే ప్రయత్నాల్లో ఎన్నికల కమిషన్ ఉంది. ఎన్నికల సంఘం ఇవిఎంలపై ఎంత విశ్వసనీయతను ప్రకటించినా, రాజకీయ పార్టీల్లో అనుమానాలు మాత్రం పోవడం లేదు. చివరికి వోటింగ్ సరళి వెల్లడి కాకుండా ఉండేందుకు కొత్త యంత్రాలను వినియోగించాలని కూడా ఎన్నికల కమిషన్ చూస్తోంది. ఓట్ల లెక్కింపు పూర్తి చేయడానికి టోటలైజర్ అనే యంత్రాన్ని ప్రవేశపెట్టే యోచన ఉంది. ఒక పోలింగ్ కేంద్రంలో ఓట్ల సరళి ఎలా ఉందో తెలియకుండా చేయడంతోపాటు ఓట్లను కలగలపడం, మరింత గోప్యత పాటించేందుకు కూడా ఈ యంత్రం ఉపయోగపడుతుంది. ఈ అంశంపె కొంతమంది ప్రముఖుల అభిప్రాయాలే ఈ వారం ఫోకస్