ఫోకస్

అంతా పబ్లిసిటీ స్టంట్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విఐపి, వివిఐపిలకు బుగ్గ కార్లు తొలగించడం అనేది ఎన్నికల స్టంట్ తప్ప మరోటి కాదు. బుగ్గకార్లను తొలగించినంత మాత్రాన ప్రజాస్వామ్యాన్ని పెద్దగా ఉద్దరించినట్టు కాదు. కానీ ఈ చర్యవల్ల ప్రజలకు ఏదో మేలు జరిగిపోయనట్లు ప్రచారం చేసుకుంటున్నారు. ప్రజాస్వామ్యాన్ని ఉద్దరించాలంటే తీసుకోవాల్సిన చర్యలు అనేకం ఉన్నాయి. వాటి జోలికి వెళ్లకుండా కేవలం పబ్లిసిటీ స్టంట్‌కోసం బుగ్గకార్లు తొలగింపును వాడుకుంటున్నారు. బుగ్గకార్లు ఏర్పాటు చేసింది స్టేటస్ సింబల్‌కోసం కాదు. విఐపిల భద్రతలో భాగంగానే వీటిని పెట్టారు. ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలంటే ప్రజలను ప్రభుత్వంలో భాగస్వామ్యం చేయాలి. ప్రజలను ప్రభువులు చేయాలి. బుగ్గకార్లను, గన్‌మెన్లను కానీ పెట్టింది స్టేటస్ సింబల్‌కోసం కాదుకదా... వీటిని స్టేటస్ సింబల్‌గా భావిస్తే మరి గన్‌మెన్లను కూడా తొలగించాలి. మరి ఆ పని ఎందుకు చేయడం లేదు, భద్రతపరంగా గన్‌మెన్లు అవసరం కనుక. గన్‌మెన్ల మాదిరిగానే బుగ్గకార్లు కూడా భద్రతపరమైన చర్యలుగానే భావించాలి. నగరాల్లో విపరీతమైన ట్రాఫిక్ పెరిగిపోయింది. ట్రాఫిక్‌లో విఐపిలు చిక్కుకోవడంవల్ల భద్రతపరంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని వారికి ఎస్కార్ట్, బుగ్గకార్లు వంటి సదుపాయాలు కల్పించారు. అయితే వీటిని స్టేటస్ సింబల్ కోసమో, ఆర్భాటం కోసమో పెట్టినట్టు ప్రభుత్వం భావిస్తే తీసివేయొచ్చు.

- కఠారి శ్రీనివాస్‌రావు అధ్యక్షుడు, లోక్‌సత్తా, తెలంగాణ