ఫోకస్

నిర్ణయం మంచిదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విఐపిలు తమ కార్లకు ఎర్రబుగ్గలు తొలగించాలంటూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మంచిదే, ఈ నిర్ణయంపట్ల హర్షం వ్యక్తం చేస్తున్నాను, స్వాగతిస్తున్నాను. ఎందుకంటే పెరుగుతున్న జనాభా, పెరుగుతున్న వాహనాలతో ఇప్పటికే నగరాలు, పట్టణాల్లో అడుగడుగునా ట్రాఫిక్ జామ్ అవుతున్నాయి. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రజలు, వాహనదారులు తమ గమ్యాలకు చేరుకోవడం దుర్లభంగా మారింది. ఈ సమయంనే ఓ వివిఐపి కారు కుయ్, కుయ్ మంటూ... రుయ్, రుయ్ మంటూ వెళ్ళడం... భారీ సైరన్‌తో వెళ్ళడం పోలీసుల హడావుడి ఇంతఅంతా అని చెప్పలేం. ఓ వివిఐపి వస్తున్నారంటనే ఐదు, పది నిమిషాల ముందునుంచే రోడ్లపై ఎక్కడికక్కడ ట్రాఫిక్‌ను ఆపి వేయడం, ఆ వివిఐపి భారీ కాన్వాయ్ దూసుకుని వెళ్ళిన తర్వాత ఒక్కసారిగా ట్రాఫిక్ ముందుకు తోసుకుని రావడంతో, భారీగా ట్రాఫిక్ జామ్‌కు దారితీస్తున్నది. దీంతో కిలో మీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోవడాన్ని చూస్తున్నాం.
ఈ తరుణంలో ప్రధాని నరేంద్ర మోదీ రోడ్లపై ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా ఉండేందుకు వీలుగా వివిఐపిలు తమ కార్లపై ఉన్న ఎర్రబుగ్గను తీసేయాలని ఆదేశించడం, సైరన్లు వేస్తూ ప్రజలకు ఇబ్బంది కలిగించరాదని చెప్పడం గొప్ప విషయం. వివిఐపి అనే వ్యక్తి ప్రజల మధ్యనే సాధారణ పౌరునిలా ఉండాల్సిందే. వివిఐపి కాకముందూ ఆ ప్రజల మధ్య ఉన్న వ్యక్తే కదా... ప్రజలు ఎన్నుకుంటేనే ఆ హోదాకు ఎన్నికయ్యారు కదా! అటువంటప్పుడు ఆ ప్రజలకే ఇబ్బంది కలిగించేలా వెళ్ళాలని ఏముంది? ఎర్ర బుగ్గలనే కాదు నీలం రంగు బుగ్గలను తొలగించాలి. సైరన్లు కొట్టడం మానేయాలి. చిన్నహోదా (ప్రొటోకాల్) ఉన్న వ్యక్తి కూడా సైరన్ వేసుకుంటూ వెళ్ళడం సముచితం కాదు. అమెరికాలో అంబులెన్స్ లేదా అగ్నిమాపక శకటం సైరన్‌తో వెళుతుంటే వాహనదారులు సైడ్ ఇవ్వడమే కాకుండా ఎక్కడికక్కడ నిలిచిపోతాయి. మనవద్ద కూడా అటువంటి మార్పు రావాలి. ఇటీవల ముఖ్యమంత్రి కాన్వాయ్ వెళుతున్నదని ఓ అంబులెన్స్‌ను పోలీసులు నిలిపివేయడంతో చివరకు అంబులెన్స్‌లో ఉన్న మహిళ మరణించింది. ఇది బాధాకరం. ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకులు, ప్రొటోకాల్ లభించినవారు చాలా సాధారణ జీవితాన్ని గడుపుతూ ఆ ప్రజలతో మమేకం కావాలి, అప్పుడే ప్రజలు హర్షిస్తారు. మన ముఖ్యమంత్రి కెసిఆర్ బుల్లెట్ ప్రూఫ్ కార్లు ఇస్తూ అనవసరంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ఢిల్లీలో కామన్‌వెల్త్ సందర్భంగా ప్రత్యేక లైన్ పెడితే, ఆ లైన్‌పైనుంచే విఐపి వాహనాలు వెళ్ళాయి. ప్రజలు బ్రహ్మండంగా సహకరించారు. ఈ విషయాన్ని నేనూ తెలంగాణ రాష్ట్ర సంబంధిత (ప్రొటోకాల్) అధికారుల దృష్టికి తీసుకెళ్ళాను. ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాల్సిందిగా సూచించాను.

- మహ్మద్ షబ్బీర్ అలీ, ప్రతిపక్ష నేత, తెలంగాణ శాసనమండలి, తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు