ఫోకస్

చీప్ గిమ్మిక్ మాత్రమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎర్ర బుగ్గ కార్ల సంస్కృతికి మంగళం పాడడం అనేది ప్రజలకు ఉపయోగం లేని నిర్ణయం. ఇది ఒక ప్రచారానికి మాత్రమే ఉపయోగపడే అంశం. బ్రిటిష్ పాలన అంతరించి స్వాతంత్య్రం వచ్చి 70ఏళ్లు గడచిన తర్వాత మన కేంద్రం తొలిసారిగా ఎర్రబుగ్గ, నీలంబుగ్గ కార్ల విధానాన్ని సమీక్షించింది. కార్లపై ఎర్రబుగ్గను తొలగించాలనే నిర్ణయంవల్ల వివిఐపి సంస్కృతికి కాలం చెల్లిందనే సందేశాన్ని ప్రజలకు అందించారు. వాస్తవానికి ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు, రాజకీయంగా అధికారంలోని వివిధ పదవుల్లో ఉండేవారికి కార్లపై ఎర్రబుగ్గ పెట్టుకునేందుకు అనుమతి ఉండేది. ఈ కార్లను చూసిన ప్రజలు మన ప్రాంత ప్రజాప్రతినిధులు వస్తున్నారని తెలుసుకుంటారు. కాని కాలక్రమంలో ఎర్రబుగ్గ కార్లు అధికార దర్పం చూపించేందుకు చాలామంది ప్రజాప్రతినిధులు వాడుకున్నారు. ఇది దుర్వినియోగం కూడా అయింది. అదే సమయంలో ప్రజాప్రతినిధులు సకాలంలో, నిర్దేశించిన గమ్యానికి వెళ్లి ప్రజా సేవ చేసేందుకు ఉపయోగపడుతుంది. సమయం దుర్వినియోగం కాదు. ట్రాఫిక్‌లో చిక్కుకోకుండా అధికారంలో ఉన్నవారు తమ గమ్యానికి చేరుకుంటారు. ఒక మంచిపనికే పెట్టిన ఎర్రబుగ్గ కార్ల సంస్కృతి రానూరానూ వివాదస్పదమైంది. కొంతమంది వివిఐపిలు దీనిని దుర్వినియోగం చేశారనే ఆరోపణలు వచ్చాయి. రాష్టప్రతి పార్లమెంటుకు వచ్చేటప్పుడు అశ్వ ప్రదర్శన ఉంటుంది. ఇది అవసరమా? దీనిని కేంద్రం సమీక్షించాలి. దేవాలయాల్లో ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు క్యూలో నిలబడి దేవుడిని సందర్శించుకునే విధానాన్ని అమలు చేయాలి. అంతేకాని ప్రత్యేకమైన ద్వారం వారికి ఎందుకు? తిరుపతితో పాటు అన్ని దేవాలయాల్లో దేవుడి ముందు అంతా సమానమే అనే నినాదంతో ప్రత్యేక దారులను బంద్ చేయాలి. దేవుడి సందర్శనకు టిక్కెట్లు ఎందుకు? ఇవన్నీ రాష్ట్రం, దేవాదాయ శాఖ పరిధిలో ఉండేవి. కాని ప్రతిచోట విఐపిలకు ఇచ్చే ప్రత్యేకతలను రద్దుచేయాలి. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేక చీప్ గిమ్కిక్కులకు పాల్పడుతోంది. మేక్ ఇన్ ఇండియా విఫలమైంది. జమ్ము కాశ్మీర్‌లో అశాంతి రాజ్యమేలుతోంది. పాకిస్తాన్‌కు మేము గట్టి బుద్ధిచెబుతామని బీరాలు పలికిన బిజెపి, అధికారంలోకి వచ్చి మూడేళ్లయింది. ఏమి ఒరగపెట్టింది. ప్రజల ఆహారపు అలవాట్లను నియంత్రించడం, అభివృద్ధికి దోహదపడని ఇతర సున్నిత అంశాలను చర్చకు తేవడం బిజెపి విధానాలవల్ల ఏమి ప్రయోజనం. ఎర్రబుగ్గ కార్ల సంస్కృతికి చెల్లుచీటివల్ల ప్రజలకు వచ్చే లాభం లేదు.

- విశే్వశ్వరరెడ్డి వైకాపా శాసనసభాపక్ష ఉపనేత ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ