ఫోకస్

పౌరులంతా విఐపిలే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రత్యేకించి విఐపిలు ఉండరు, పౌరులు అంతా విఐపిలే. అధికారంలో ఉన్నవారంతా ప్రజాసేవకులే. అలాంటపుడు వారికి, వారి వాహనాలకు పటోటోపం అవసరం లేదు. వలస పాలకుల కాలంనాటి భేషజాలకు ప్రతీకే వాహనాలకు ఎర్రబల్బు. చట్టంముందు అందరూ సమానమే అన్న రాజ్యాంగవౌలిక స్ఫూర్తికి మన్నన దక్కించించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ప్రతి ఒక్కరి ఆశీస్సులు నాయకులకు కావాలి, అంటే ప్రతి ఒక్కరూ విఐపి అనే కదా అర్థం. ప్రధాని నరేంద్ర మోదీ అనేక చారిత్రాత్మక నిర్ణయాలను తీసుకుంటున్నారు. ఇదొక చిన్న నిర్ణయంగా అనిపించినా, దాని సందేశం చాలా పెద్దది. దేశంలో ప్రజలంతా సమానం. అధికారం ఉన్నంత మాత్రాన వారు వేరే వర్గం కాదు అని తెలియజెప్పేలా ప్రధాని నిర్ణయం తీసుకున్నారు. బుగ్గకారు తొలగించాలన్న క్యాబినెట్ నిర్ణయం వెలువడిన మరుక్షణమే, అనేకమంది మంత్రులు, ముఖ్యమంత్రులు తమ కార్లపై ఉన్న ఎర్రలైట్లను తొలగించారంటే అర్థం చేసుకోవచ్చు. నిర్ణయం ప్రభావం ఎంతగా ఉందో. వాస్తవానికి నేను ఎన్నడూ ఎర్రలైటు వాడలేదు. దానిని ప్రచారం కూడా చేసుకోలేదు. చూసినవారికి తెలిసేది అంతే, ప్రధాని తీసుకున్న నిర్ణయం చట్టపరంగా అమలులోకి రాకముందే ప్రతి ఒక్కరూ ఆ నిర్ణయం వెనుకున్న సందేశాన్ని అర్థం చేసుకోవాలి. ఎర్రబుగ్గ తొలగించడం అంటే భద్రతను తొలగించడం కాదు, ప్రముఖులకు ప్రస్తుతం ఉన్న భద్రత యథాతథంగా కొనసాగుతుంది. దానిపై ఎలాంటి అనుమానాలు అక్కర్లేదు. దేశంలో ప్రజలు అందరూ సర్వసమానమే అనేదే పార్టీ సిద్ధాంతం, ప్రభుత్వ సిద్ధాంతం కూడా. అందరినీ సమానంగా చూడటం కూడా మా ఉద్ధేశ్యం. రాష్ట్ర ప్రభుత్వాలు సైతం కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయడంద్వారా ప్రజల్లో ఉన్న విభిన్నమైన ఆలోచనలను తొలగించేందుకు కృషి చేయాల్సి ఉంది.

- ఎం వెంకయ్యనాయుడు కేంద్ర సమాచార ప్రసార శాఖా మంత్రి