ఫోకస్

ప్రజలకు దగ్గర కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రజా ప్రతినిధులు అంటే ప్రజలకు దూరంగా ఉండడం కాదు... అధికార దర్పం ప్రదర్శించడం కాదు. ప్రజల్లో ఒకరిగా ఉండాలి. రాజకీయాల్లో అలా ఉన్నవారికే అవకాశం ఉంటుంది. తెలంగాణ ఆవిర్భావం జరగగానే కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత పలు సందర్భాల్లో ఇదే మాట చెప్పారు. అధికారంలో ఉన్నామనే దర్పం, అహంకారం అస్సలు ఉండకూడదు. మనమేమీ వెయ్యేళ్లు బతకడానికి రాలేదు. బతికిన కొద్దికాలం ప్రజల హృదయాల్లో నిలిచిపోదామని చెప్పారు. ఉదృతంగా ఉద్యమం సాగించినవాళ్లు కూడా అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజల్లో ఒకరిగా నిలిచిపోయారు. అందువల్లనే ప్రతి ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ను ప్రజలు గెలిపిస్తున్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, కార్పొరేటర్లు అందరికీ ముఖ్యమంత్రి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. అన్నిచోట్లా ఇదే మాట అధికార దర్పం కూడదు అని.
అధికార దర్పం ప్రదర్శించే బుగ్గకారు, కాన్వాయ్ వంటి వాటిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన సూచనలు మంచివే. బుగ్గకారు ఉందా లేదా అనే దానికన్నా ప్రజాప్రతినిధిగా ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తున్నారా? ప్రజల్లో మమేకం అయ్యారా... లేదా? అనేది ముఖ్యం. ఉద్యమ పార్టీ ప్రజలనుంచి వచ్చిన పార్టీ కావడం వల్ల టిఆర్‌ఎస్‌కు అధికార దర్పం లేదు. ప్రజలతో కలిసే ఉన్నాం, ప్రజలతోనే ఉన్నాం. ప్రధానమంత్రి ఈ మధ్య బుగ్గకారు గురించి చెప్పారు, కానీ ఐటి శాఖ మంత్రి కె తారక రామారావు జూన్ రెండున మంత్రిగా ప్రమాణస్వీకారం చేసినప్పటినుంచి, ఇప్పటివరకు బుగ్గకారు వాడలేదు. కాన్వాయ్ లేదు.
స్వయంగా ముఖ్యమంత్రి ఏమాత్రం దర్పం ప్రదర్శించకుండా సామాన్య రైతులతో ముచ్చటిస్తారు. చేనేత కార్మికులతో వారి సమస్యలను అడిగి తెలుసుకుంటారు. అంగన్‌వాడీలతో, రైతులతో, మహిళా సంఘాలతో విస్తృతంగా చర్చించి, వారి సమస్యలు, వాటిని ఎలా పరిష్కరించాలో చర్చించారు. అధికార దర్పం ఉన్నవాళ్లు ప్రజలకు దూరమవుతారు. మేం ప్రజల నుంచి వచ్చాం... వారి సమస్యలను పరిష్కరించడమే మా ప్రధాన విధి అని భావించిన ప్రజాప్రతినిధులు ప్రజలతోనే ఉంటారు. ప్రజల్లో ఒకరిగా ఉంటారు.
కొన్ని నియమి నిబంధనలు మార్చినంత మాత్రాన ప్రజలకు ఉపయోగం లేదు. ప్రజాప్రతినిధిగా నిరంతరం ప్రజలకోసం కృషి చేయడమే ప్రజలపట్ల కర్తవ్యం నెరవేర్చడం అవుతుంది.
కాలానికి తగ్గట్టు మార్పులు అవసరం, ఎప్పుడో పూర్వకాలంలో మొదలైన అధికార దర్పాలు ఇప్పుడు అవసరం లేదు.

- పల్లా రాజేశ్వర్‌రెడ్డి ప్రభుత్వ విప్, టిఆర్‌ఎస్ ఎమ్మెల్సీ