ఫోకస్

‘ఎర్రబుగ్గ’ పోతేనేమి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సైరన్‌తో వెలుగుతూ ఆరుతూ ఉండే ఎర్రలైటు వాహనాల గుంపు వస్తోందంటే చాలు ఆ ప్రాంతంలో ఉండే హంగామా అంతా ఇంతా కాదు. విఐపిలకు, వివిఐపిలకు రాజ్యాంగ రక్షణగా వారి వాహనాలపై ఎర్రలైటు లేదా నీలం లైట్లను వినియోగిస్తున్నారు. ప్రజాప్రతినిధులకు, పరిపాలకులకు, న్యాయమూర్తులకు, సివిల్ సర్వీసు అధికారులకు హోదాకు తగ్గట్టు వారు ప్రయాణించే కార్లపై సూచనగా ఎర్రలైటు ఉంటుంది. అయితే ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీఎ ప్రభుత్వం విఐపి కార్లపై ఎర్రబుగ్గల సంస్కృతికి స్వస్తి పలికింది. ఇక మీదట ప్రముఖులు ఎవ్వరూ తమ కార్లపై ఎర్రలైటు పెట్టుకుని హడావుడి ప్రయాణాలతో సామాన్యుడికి ఇబ్బంది కలిగించే పరిస్థితి ఇక ఉండదు అనేది సుస్పష్టం. దేశం మొత్తం మీద ఎర్ర లైట్ల సంస్కృతికి మే 1 నుండి తెరదించుతున్నట్టు ప్రభుత్వం పేర్కొంది. ఆ తర్వాత ఎవరైనా కారుపై ఎర్రలైటు వేసుకుని ప్రయాణిస్తే శిక్షార్హులవుతారు. నరేంద్ర మోదీ నేతృత్వంలోని మంత్రివర్గ సమావేశం తీసుకున్న ఈ నిర్ణయం తీవ్ర సంచలనానే్న కలిగించింది. అత్యంత ముఖ్యమైన సేవలు అందించే పోలీసులు, అగ్నిమాపకదళం, అంబులెన్స్‌లు మాత్రం నీలం రంగు లైట్లు పెట్టుకునేందుకు వీలు కల్పించారు. కార్లపై ఎర్రలైటు పెట్టుకుని రోడ్లపై సామాన్యులకు ఇబ్బంది కలిగించే విఐపి సంస్కృతికి ఫుల్‌స్టాప్ పెట్టాలని ఎన్‌డిఎ ప్రభుత్వం యోచిస్తోంది. ఈ అంశంపై ఉపరితల రవాణా మంత్రిత్వశాఖ అనేకమార్లు చర్చలు నిర్వహించింది. అధికార దర్పంకోసం కొందరు, విఐపి అనే అభిప్రాయం కల్పించేందుకు కొందరు వాహనాలపై ఎర్రలైట్లు పెట్టుకుని సామాన్యులకు ఇబ్బంది కలిగిస్తున్నారు. ఈ విఐపి సంస్కృతిని తొలగించేందుకు కేంద్రం అసాధారణ నిర్ణయాన్ని తీసుకుంది. ఎర్రలైటుకు వీలుకల్పించే చట్టంలోని రూల్ 108(2)ను సవరించింది. ఈ సవరణలు వల్ల పోలీసులు, అగ్నిమాపకదళం, అంబులెన్స్‌లపై నీలం రంగు పెట్టుకునేందుకు వీలుకలుగుతుంది. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ ఎయిర్‌పోర్టుకు వెళ్లినపుడు ఎర్రబుగ్గ తొలగించి సాధారణ ట్రాఫిక్‌లోనే వెళ్లారు. ప్రధాని కాన్వాయికోసం ఎక్కడా ట్రాఫిక్‌ను నిలిపివేయలేదు. ఇక మీదట కూడా ప్రధాని ప్రయాణించే సమయంలో ట్రాఫిక్‌ను నిలిపివేయరాదని ప్రధాని కార్యాలయం సూచించింది. అలాగే ఇప్పటికే కొంతమంది ముఖ్యమంత్రులు సైతం తమ వాహనాలపై ఉన్న బుగ్గకార్లను తొలగించారు. వాస్తవానికి ఎర్రబుగ్గల సంస్కృతిని తొలగించాలని సుప్రీంకోర్టు 2013లోనే కేంద్రాన్ని ఆదేశించింది. అయితే కేంద్రం ఇపుడు రాజ్యాంగ పదవులతో పాటు ఇతర పదవులు నిర్వహించే వారి కార్లపైనా ఎర్రలైట్లు పెట్టుకోకుండా చర్యలు తీసుకుంది. ఇంతకాలం దాదాపు 30 క్యాటగిరిల్లో వివిధ స్థాయిల్లోని వారికి తమ కార్లపై ఎర్రబుగ్గ పెట్టుకునేందుకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు 108వ రూల్ కింద అనుమతిచ్చేవి. ఆ సంస్కృతికి మే 1 నుండి చరమాంకం పలకనుంది. అంటే ఈ లైట్లను తొలగించడంతో పరిస్థితి అదుపులోకి వస్తుందా, సామాన్యుల ఆక్రోశం తీరిపోతుందా అనేది ప్రశ్నార్థకం. దీనిపై కొంతమంది ప్రముఖుల అభిప్రాయాలే ఈ వారం ఫోకస్.