ఫోకస్

కాంట్రాక్ట్ ఉద్యోగులది జీవన్మరణ సమస్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2002నుంచి వివిధ ప్రభుత్వ శాఖల్లో ప్రభుత్వంచే నియమించబడుతూ వస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులు జీవన్మరణ సమస్యతో కొట్టుమిట్టాడుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థలు కాకుండా వివిధ ప్రభుత్వ శాఖల్లో ప్రభుత్వం నుంచి జీతాలు పొందుతున్న కాంట్రాక్ట్ ఉద్యోగులు దాదాపు 25వేల మంది ఉన్నారు. వీరిలో వైద్య, ఆరోగ్యశాఖలో 16వేల మంది ఆ తర్వాత విద్య, వ్యవసాయ శాఖల్లో అత్యధిక మంది పనిచేస్తున్నారు. వీరుగాకుండా ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు 50వేల మంది ఉన్నారు. నిరుద్యోగ సమస్య జటిలంగా ఉన్న నేపధ్యంలో కాంట్రాక్టు ఉద్యోగులు తొలుత ఉత్సాహంగానే వచ్చి చేరుతున్నారు. ఐదేళ్ల తర్వాత పెళ్లిళ్లయి పిల్లలు పుట్టి ఖర్చులు పెరిగి జీతాలు చాలక రోడ్డెక్కుతున్నారు. ఇక వీరిని రెగ్యులరైజ్ చేయాలంటూ ఎన్నో విధాలుగా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నాం. ప్రభుత్వం సానుకూలంగా ఉన్న సమయాల్లో న్యాయపరమైన చిక్కులు వస్తున్నాయి. 2006లో కర్నాటకలో ఒక కేసులో సుప్రీంకోర్టు రెగ్యులరైజేషన్‌ను వ్యతిరేకించింది. తొలుత శాశ్వత ఉద్యోగం పేరిట నోటిఫికేషన్ జారీచేస్తే అత్యధిక మంది పోటీబడేవారంటూ వ్యాఖ్యానించింది. పంజాబ్‌లో ఇటీవల ఎన్నికలకు ముందు రాష్ట్ర ప్రభుత్వం రెగ్యులరైజేషన్‌కోసం బిల్లు ఆమోదిస్తే అక్కడి హైకోర్టు చెల్లదంటూ తీర్పునిచ్చింది. తెలంగాణాలో రెగ్యులరైజేషన్ జీవోలు జారీకాగా 10ఏళ్ల లోపువారిని రెగ్యులరైజేషన్ చేయరాదంటూ హైకోర్టు ఆదేశించింది. ఈ విధంగా న్యాయపరమైన చిక్కులు ఎదురవుతున్నందున కాలానుగుణంగా వేతనాలు పెంచాలంటూ తాము ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తున్నాం. వాస్తవానికి ప్రభుత్వ ఉదాశీన వైఖరి వలనే ఈ సమస్య నానాటికీ జటిలంగా మారుతున్నది.

-పరుచూరి అశోక్‌బాబు, అధ్యక్షుడు, ఎపి ఎన్‌జివో సంఘం