ఫోకస్

నిబంధనల మేరకే క్రమబద్ధీకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిబంధనల మేరకు కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలి. అర్హతలుండి కాంట్రాక్టు కార్మికులుగా నిబంధనల మేరకు ఉద్యోగంలో చేరినవారు కొంతకాలం సర్వీసు పూర్తి చేసుకున్న అనంతరం క్రమబద్ధీకరణకు అర్హులవుతారు. అయతే ఇది ఉద్యోగంలో చేరే సందర్భంలో అనుసరించిన విధి ధానాలపై ఆధారపడి ఉంటుంది. రోస్టర్ ప్రకారం అర్హతలున్నవారు కాంట్రాక్టు ఉద్యోగులుగా విధుల్లో చేరితే, వారికి అవకాశం కల్పించడం సహేతుకమే. అయితే విద్యా, సాంకేతిక అంశాల్లో అర్హతలు ఇక్కడ ప్రధానాంశం. రాష్ట్రంలో కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించే విషయంలో కసరత్తు ప్రారంభమైంది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం మంత్రి వర్గ ఉపసంఘాన్ని నియమించింది. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించే విషయంలో విధివిధానాలు రూపకల్పన చేసింది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టు ఉద్యోగుల జీతాలను 50 శాతం పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. కాంట్రాక్టు ప్రాతిపదిక తీసుకున్న వైద్యులను క్రమబద్ధీకరించే విషయంలో చేపట్టిన నిర్ణయాలను ఈ సందర్భంగా గుర్తుంచుకోవాలి. మూడేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వైద్యులను క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం సానుకూలత వ్యక్తం చేసింది. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ విషయంలో మంత్రి వర్గ ఉపసంఘం నిబంధనలకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటుందనే భావిస్తున్నాను. ఆర్థిక, సాంకేతిక అంశాలకు లోబడి ప్రభుత్వం కూడా సానుకూలంగానే స్పందిస్తుందని భావిద్దాం.

- కంభంపాటి హరిబాబు ఎపి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు