ఫోకస్

హామీ నిలుపుకోవాల్సిందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాంట్రాక్ట్ ఉద్యోగులను శాశ్వత ఉద్యోగులుగా నియమిస్తామన్నది తెలుగుదేశం పార్టీ, ముఖ్యమంత్రి చంద్రబాబు గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ. దీనిని నెరవేర్చి తీరాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ డిమాండ్ చేస్తోంది. రాష్ట్రంలో వివిధ వర్గాల ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఇదొకటి. ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చి మూడేళ్లయినా హామీలు నెరవేర్చడం లేదు. వాళ్లకు నచ్చినవి మాత్రమే గుర్తుంటాయి. వేరే ఏవీ గుర్తుండవు. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసేందుకు చట్టపరంగా ఇబ్బందులు ఉన్నాయి.. హామీ ఇచ్చేటపుడు తెలీదా ఈ సమస్యలున్నాయని? వాటిని రిజాల్వ్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. కమీషన్లు వచ్చే వాటికైతే ఎలాంటి ఆటంకాలున్నా చేసేస్తారు. ఏమీ రాదని తెలిసి చట్టపరంగా సమస్యలున్నాయంటారా? పోలవరం కేంద్రం పరిధిలోని ప్రాజెక్టు. అందులో కమీషన్లు వస్తాయి. అందుకే రెజుల్యూషన్ పాస్ చేసి రాష్టప్రతికి పంపారు. అదే ప్రత్యేక హోదాలోనూ, ప్రజలకిచ్చిన హామీల్లోనూ కమీషన్లు రావు. సమస్యలున్నాయని పోలవరం పనులు చేపట్టలేదా? అలాగే కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌ను కూడా నెరవేర్చండి. మీరు నెరవేర్చలేదంటే మోసం చేసినట్లే... అలా అయితే మోసం చేశామని ఒప్పుకోండి.. లేదా రిజాల్వ్ చేసి హామీ నిలుపుకోండి.. తొమ్మిదేళ్లు అధికారంలో ఉన్నాం.. పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్నాం.. మాకు అంత అనుభవం ఉంది.. అంత అనుభవం ఉందని చెప్పుకునే ముఖ్యమంత్రి చంద్రబాబు రెగ్యులరైజేషన్‌ను ఎందుకు పట్టించుకోవడం లేదు? ఎన్నికల్లో ఇచ్చిన రెగ్యులరైజేషన్‌ను అమలు చేసి తీరాలి.

- ఎన్.రఘువీరారెడ్డి అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ