ఫోకస్

ఎన్నికల మేనిఫెస్టోను ఇసి పర్యవేక్షించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పార్టీలు మేనిఫేస్టోలో ఇచ్చిన హామీలను ఖచ్చితంగా అమలు చేసే విధంగా ఎన్నికల కమిషన్ లీగల్‌గా బైండోవర్ చర్యలు తీసుకున్నపుడే పార్టీలు ఇచ్చిన హామీలు అమలయ్యేందుకు అవకాశం వుంది.. ఇటువంటి పరిస్థితి వచ్చినపుడే కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ వంటి హామీలు అమలవుతాయి. అధికారంలో వున్న ప్రభుత్వాలకు పూర్తి పారదర్శకత వుంటేనే ఇచ్చిన హామీలు నెరవేరుతాయని, ప్రజలనుంచి ఎంటువంటి ఆందోళనకు తావుండదు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు హామీలు ఇచ్చిన ప్రభుత్వాలు గద్దెనెక్కి ఆపై ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా అమలుచేయలేకపోతున్నామని చెప్పడం రివాజుగా మారిపోయింది. ఇది సరికాదు. ఎప్పటికైనా పర్మినెంట్ అవుతుందనే ఆశతోనే ఈ ఉద్యోగాల్లో చేరుతున్నారు. అవుట్ సోర్సింగ్ పోస్టులకు కూడా లక్షల లంచాలు తీసుకుని నియామకాలు చేయడం ఈ ప్రభుత్వంలో అలవాటైపోయింది. పర్మినెంట్ అవుతుందనే ఆశతో ఉచితంగా పని చేస్తున్నట్టుగానే ఈ ఉద్యోగాలు తయారయ్యాయి. ప్రతీ పార్టీ క్రమబద్ధీకరిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా చేయలేకపోతున్నామంటున్నాయి. మేనిఫేస్టోలో పెట్టినపుడే ఎన్నికల కమిషన్ లీగల్‌గా బైండోవర్ తీసుకోవాల్సివుంది. ఆ దిశగా ఆలోచనచేస్తే బావుంటుంది. ఇచ్చిన హామీలు కచ్చితంగా అమలు జరుగుతాయి. పార్టీల మేనిఫేస్టోలో పెట్టిన అంశాలకు సంబంధించి అమలు చేసే విధానం, ఏ విధంగా అమలుచేస్తారు తదితర అంశాలపై నిర్ధిష్టంగా ముందుగానే బైండోవర్ తీసుకోవాల్సివుంది. అమలుచేయలేకపోతే ఎందుకు అమలు చేయలేదో కూడా తెలియజేసే విధంగా చర్యలు తీసుకున్నపుడు హామీలు కచ్చితంగా అమలై తీరుతాయి. అమలయ్యే అంశాలపైనే సాధ్యాసాధ్యాలను బట్టి హామీలు ఇచ్చేందుకు అవకాశం వుంది. ఏదో చెప్పేసి అధికారంలోకి రావడమే కాదు..అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయకపోతే ఆయా ప్రభుత్వాలపై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకునే విధంగా ఒక విధానం అమల్లోకి వచ్చినపుడే న్యాయం జరుగుతుంది. ఉదాహరణకు ఎపి ట్రాన్స్‌కోలో కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ షిఫ్ట్ ఆపరేటర్ల పోస్టులకు కూడా ఐదేసి లక్షల రూపాయల లంచం తీసుకుంటుంన్న సంఘటన లున్నాయి. ఈ ఉద్యోగాల్లోకి చేరేవారు ఉద్యోగం పర్మినెంట్ అవుతుందని ఆశతో చేరుతున్నారు. ఎంతకీ పర్మిమెంట్ కాకపోవడం వల్ల నష్టపోతున్నారు. పర్మినెంట్ చేయాలి, ఉద్యోగ భద్రత కల్పించాలనే ఉద్యోగ దృక్పథం రావడం చాలామంచిది. గ్యారంటీ లేని ఉద్యోగానికి లక్షలు ధారపోసి పర్మినెంట్ అవుతుందనే ఆశతో చేరుతున్నారు.. ఈ వాతావరణం సమసిపోవాలి. మేనిఫెస్టోలో ఇచ్చిన అంశాలు రుణమాఫీ గానీ, డ్వాక్రా రుణమాఫీ గానీ, రైతాంగ సమస్యలు గానీ ఇటువంటి ఆందోళనలు వస్తున్నాయంటే ప్రభుత్వాలు పారదర్శకంగా పనిచేయకపోవడమే కారణం. ప్రభుత్వంలోని మంత్రులు దోచేసుకుని దాచేసుకుంటున్నారని ప్రజలు బలంగా నమ్ముతున్నారు. ప్రజల్లో వున్న ఈ ఆలోచన పోవాలన్నా, ఆందోళనలకు చరమగీతం పాడాలన్నా సంపూర్ణ పారదర్శకతతో పాలన సాగించాలి.

- ఉండవల్లి అరుణ్‌కుమార్ మాజీ ఎంపి. రాజమహేంద్రవరం