ఫోకస్

ఆధారే ఆధారమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆధార్ అనేది నిర్దేశిత తనిఖీ ప్రక్రియను పూర్తిచేసిన తర్వాత దేశవాసులకు జారీచేసే 12 అంకెల సంఖ్య. లింగబేధం, వయసు వంటి వాటితో సంబంధం లేకుండా దేశవాసులు ఎవరైనా ఈ సంఖ్యకోసం నమోదు చేసుకోవచ్చు. ఇందుకోసం ఎలాంటి రుసుము చెల్లించనక్కర్లేదు. నమోదు సమయంలో జనసంఖ్య సంబంధంగా, జీవ సంబంధంగా కనీస సమాచారాన్ని అందించాల్సి ఉంటుంది. ఒక వ్యక్తి ఒక్కసారి మాత్రమే నమోదు చేసుకోవాలి, వారి వివరాలు పునరావృతం కాలేదని కూడా రూఢీ చేసుకున్న తర్వాత మాత్రమే వారికి ఒక విశిష్ట సంఖ్యను సృష్టిస్తారు. అందువల్ల జీవితకాలం చెల్లుబాటు అయ్యేలా వ్యక్తిగత గుర్తింపు సంఖ్యను రూపొందిస్తారు. దీనిని ఆన్‌లైన్‌లో ఏ సమయంలోనైనా, ఎక్కడైనా తనకు తగిన వాతావరణంలో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా పరిశీలనకు సైతం వినియోగిస్తారు. ఆధార్ సంఖ్యలో వ్యక్తిగత జాడ లేదా నిఘా అనేది ఉండదు, ఇది కేవలం వ్యక్తిగత గుర్తింపునకు మాత్రమే దోహదం చేస్తుంది. అంతేతప్ప ఇది పౌరసత్వ ధ్రువీకరణగా కూడా పనికిరాదు, అలాగే దీనిద్వారా ఎలాంటి హక్కులు, లబ్దికి కూడా హామీ లేదు. ఆధార్‌ను వివిధ పథకాలలో లబ్ధిదారుల ఎంపిక పరిశీలనకు, చిరునామా పరిశీలనకు, వ్యక్తి గుర్తింపునకు వేలిముద్రల పరిశీలనకు వినియోగిస్తున్నారు. అంతేకాదు, వ్యక్తుల పూర్వాపరాలు, తండ్రి, తల్లి పేరు, చిరునామా, పుట్టినతేదీ తదితర వివరాలకు పరిశీలించే విధానం క్రమక్రమంగా అమలులోకి వస్తోంది. ఆధార్‌ను న్యాయపరంగా, సమానత్వానికి ఒక ఉపకరణంగా చెప్పవచ్చు. సామాజిక , ఆర్థిక సార్వజనీనతకేగాక, ప్రభుత్వ రంగ సేవా సంస్కరణలకు, దారిద్య్ర అంచనాల నిర్వహణకు కూడా ఆధార్ ఒక వ్యూహాత్మక విధానోపకరణంగా ఉపయోగపడుతోంది. సౌలభ్యం మెరుగుదలకు, ఎలాంటి చిక్కులు లేని ప్రజా కేంద్రక పాలనకు ఉపయుక్తమైన పరికరం. దేశంలోని ప్రతి వ్యక్తికీ విశిష్ట గుర్తింపు ఇస్తున్నందువల్ల డిజిటల్ ఇండియా సౌధానికి ఆధార్ గుర్తింపు వేదిక, ఒక కీలక మూలస్తంభంగా మారింది. ఆధార్ ఇప్పటికే ఎన్నో మైలురాళ్లను దాటడమేగాక, ప్రపంచంలోనే విశిష్ట జీవసంబంధ ఆధారిత గుర్త్తింపు వ్యవస్థగా కూడా ప్రత్యేకతను చాటుకుంది. విశిష్టత, పరిమాణీకరణ, ఆర్థిక చిరునామా, కెవైసి అనేవి ఆధార్‌కు నాలుగు ప్రాథమిక లక్షణాలున్నాయి. కేవలం ఆధార్ నెంబర్ ఆధారంగా భారత ప్రభుత్వం ప్రతి నివాసినీ చేరగల సౌలభ్యం కల్పిస్తుంది. అదే విధంగా మునె్నన్నడూ లేని రీతిలో నివాసులు తమకు చెందాల్సిన వివిధ రాయితీలు, ప్రయోజనాలు, సేవలను అందుకునే మార్గం సుగమం అవుతోంది. బయోమెట్రిక్ ఆధార్ కార్డుల వల్ల ఎవరినైనా, ఎక్కడైనా ఠక్కున గుర్తించవచ్చు. అయితే రోజురోజుకూ అన్ని విషయాలకూ ఆధార్ కార్డును నిర్బంధం చేయడం అనేది వివాదాస్పదంగా మారింది. కొంతమంది ఇంకా ఆధార్ కార్డును (ఆధార్ సంఖ్య)ను పొందలేకపోయారు. నూరు శాతం ప్రజలకు ఆధార్ సంఖ్య లేకుండా నిర్బంధం చేయడం సబబుకాదని ఉన్నత న్యాయస్థానం అంటోంది. కొన్ని పథకాలకు లబ్ధిదారులను ఎంపిక చేసే విషయంలో ఆధార్‌ను వినియోగించడంపై ఎలాంటి అభ్యంతరం లేకున్నా అన్నింటికీ ఆధార్ కావాలని చెప్పడం సరికాదని ఉన్నత న్యాయస్థానం చెబుతోంది. దీనిపై ఇప్పటికీ న్యాయస్థానంలో కేసు నడుస్తోంది. మరోవైపు ఆధార్ గణాంకాలు బహిర్గతం కావడంపై కూడా ఉన్నత న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాలనూ నిలదీసింది. ఈ అంశంపై కొంతమంది ప్రముఖుల అభిప్రాయాలే ఈ వారం ఫోకస్.