ఫోకస్

ముందు చూపుంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశవ్యాప్తంగా ఐటి కంపెనీల్లో ప్రస్తుతం పనిచేసే ఉద్యోగులను దశలవారీగా తొలగించే కార్యక్రమం ఆందోళన కలిగిస్తోంది. నాడు ఎలాంటి వౌలిక సదుపాయాలు లేకపోయినప్పటికీ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఇష్టానుసారం ఇంజనీరింగ్ కళాశాలలకు అనుమతి ఇచ్చారు. ఆ కళాశాలలపై ఎలాంటి పర్యవేక్షణా లేదు. దీంతో నాసిరకమైన విద్యతో అనేకమంది విద్యార్థులు రోడ్డునపడ్డారు. వీరిలో అత్యధిక మందికి నైపుణ్యత లేకపోవటంవల్ల కూడా ఐటి ఉద్యోగాల్లో కోత నానాటికీ పెరుగుతోంది. అందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందుచూపుతో ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ను ఏర్పాటుచేసి అందులో దేశ, విదేశాల్లో ఐటి ఉద్యోగాలకు సంబంధించిన శిక్షణ ఇవ్వటానికి శ్రీకారం చుట్టారు. ఇక్కడ శిక్షణ పొందినవారు ఏ ఒక్కరిపై ఆధారపడకూడదు అనే ఉద్దేశ్యంతో ఏపి నాలెడ్జ్ హబ్‌తోపాటు ఐవోటి వంటి అనేక సంస్థల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. సరికొత్తగా రోబోటెక్స్ సంస్థ కూడా తెరపైకి వచ్చింది. వీరికోసం చంద్రబాబు దేశ, విదేశీ పెట్టుబడులను ఆకర్షిస్తూ ఇప్పటికే అనేక ఎంవోయులు కుదుర్చుకున్నారు. దీనివలన ఏ మూతబడే సంస్థ గురించి ఆలోచించకుండానే కొత్తగా ఐటి రంగంలో లక్ష మందికి, వివిధ రంగాల్లో ఐదు లక్షల మందికి రాబోయే రెండేళ్లలో ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ప్రధానంగా పరిశ్రమలు, పర్యాటకం, సర్వీస్ సెక్టార్లలో వీరికి ఉపాధి లభించబోతుంది. రాష్ట్రంలో ఐటి రంగానికి సరికొత్త వైభవం చేకూరబోతున్నది.

- కొల్లు రవీంద్ర, ఏపీ క్రీడా, న్యాయశాఖామాత్యులు