ఫోకస్

స్థానికంగానే ఉపాధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐటి రంగంలో భారీగా ఉద్యోగాలకు కోత విధిస్తున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే భారత్ నుంచి అమెరికాకు వెళ్లి అక్కడ ఐటి రంగంలో ఉపాధి పొందుతున్న వారి సంఖ్య లక్షల్లో ఉంది. దీంతో అమెరికన్లలో ఇతర దేశాల నుంచి ఆయా దేశాలకు వలసలు రావడం వల్ల అక్కడ స్థానికులకు ఉపాధి దొరకడం లేదని ఆందోళన చేపట్టారు. దీంతో అక్కడ కంపెనీలు కూడా కనీస వేతనాలు చెల్లించడం లేదని అమెరికన్లు వత్తిడి తేవడంతో వారు కనీస వేతనాలను చెల్లించేందుకు ముందుకు వచ్చారు. అదే తరుణంలో ఐటి రంగంలో వస్తున్న అధునాతన సాంకేతిక పరిజ్ఞానమైన బిగ్‌డేటా, ఆటోమేషన్ వంటి మార్పులు రావడంతో ఉద్యోగాల్లో భారీగా కోత ఏర్పడింది. తక్కువమంది సిబ్బందితోనే విధులు నిర్వహించే వీలు కలిగింది. ఇటువంటి పరిస్థితుల్లో ఉద్యోగులు తమ సామర్థ్యాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ‘మేక్ ఇండియా’ అని నినాదం చేస్తున్నాము. అందువల్ల భారతీయులకు భారత్‌లో ఉద్యోగాలు లభించే విధంగా వనరులను సమీకరించుకోవాలి. ప్రపంచదేశాల్లో విధానాలకు అనుగుణంగా మన విధానాలను మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇతర దేశాల్లోగాని, మన దేశంలోగాని ఐటి రంగంలో ఉపాధి కోల్పోయిన వారికి ప్రత్యామ్నాయంగా ఏ రకమైన ఉపాధి చూపగలమన్నదీ నిర్ధారించుకోవాలి. మనదేశ ఆర్థిక విధానాలు, మన పారిశ్రామికాభివృద్ధి సక్రమంగా ఉంటే ఇక్కడ పెద్దఎత్తున ఉపాధి లభించే అవకాశం ఉంటుంది. మన జనాభాకు తగ్గట్టుగా చదువులు, ఉపాధి కల్పన వంటి రంగాల్లో సరైన చర్యలు తీసుకోవాలి.

- బొత్స సత్యనారాయణ ఏపీ వైకాపా నాయకుడు