ఫోకస్

సదుపాయాలు కల్పిస్తేనే అభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నవ్యాంధ్రలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అభివృద్ధి ఒక రకంగా చెప్పాలంటే నత్తనడక నడుస్తోంది. రాష్ట్ర విభజన కూడా ఇందుకు కారణం కావచ్చు. నవ్యాంధ్రలో ఐటి రంగం అభివృద్ధికి విస్తృత అవకాశాలు ఉన్నప్పటికీ, ప్రభుత్వ పరంగా కొంత సహకారం అవసరమనే చెప్పాలి. ఇదే సందర్భంలో ప్రభుత్వం కూడా నూతన ఐటి పాలసీ రూపకల్పన చేస్తోంది. డిజిగ్నేటెడ్ టెక్నాలజీ పార్కు (డిటిపి) లను అభివృద్ధి చేయడం ద్వారా ఐటి కంపెనీలు తమ కార్యకలాపాలు ప్రారంభించుకునేలా సదుపాయాలు కల్పించడం. ప్రైవేటు డెవలపర్లు డిటిపిలను అభివృద్ధి పరచి, ప్రభుత్వ అనుమతి తీసుకుంటే, ఇక్కడ ఏర్పాటు చేసే ఐటి కంపెనీల అద్దెలో 70 శాతం ప్రభుత్వమే గ్యారంటీ ఇస్తుంది. దీని వల్ల ఐటి కంపెనీలకు అన్ని వసతులతో కూడిన వసతి లభిస్తుంది. దీనితో పాటు ప్రభుత్వ పరంగా కూడా అన్ని వసతులతో కూడిన వసతి సదుపాయాలు అందుబాటులోకి తీసుకురావడం. ఈ విధానంలో 50 శాతం అద్దె ప్రభుత్వం సబ్సిడీగా ఇస్తుంది. ఇటువంటి రాయితీలను కల్పించడం ద్వారా ఐటి రంగాన్ని సాధ్యమైనంత త్వరగానే అభివృద్ధి చేయవచ్చు. ఐటి రంగం అభివృద్ధి సాధిస్తే యువతకు విస్తృత ఉపాధి అవకాశాలు లభిస్తాయి. హైదరాబాద్ తరువాత ఐటి రంగం అభివృద్ధి చెందేందుకు విశాఖ నగరానికే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రభుత్వ పరంగా నిబంధనల్లో కొన్ని సడలింపులు ఇవ్వడం ద్వారా మరిన్ని కంపెనీలు ఇక్కడ ఏర్పాటయ్యేందుకు అవకాశాలున్నాయి. ముఖ్యంగా రుషికొండ వద్ద ఇప్పటికే ఏర్పాటైన ఐటి సెజ్‌లను డీ నోటిఫై చేయడం వల్ల కూడా మరిన్ని కంపెనీలు ఇక్కడ తమ కార్యకలాపాలను ప్రారంభించే అవకాశం ఉంది. రుషికొండ ఐటి సెజ్ హిల్ 1 ఇప్పటికే ప్రభుత్వం డీ నోటిఫై చేసిందని, హిల్ 2ను డీ నోటిఫై చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. నవ్యాంధ్రలో ఐటి రంగం అభివృద్ధికి ఉన్న విస్తృత అవకాశాలు సద్వినియోగం చేసుకునే క్రమంలో ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోందనే భావించాలి. అన్నీ అనుకూలిస్తే విశాఖ ఐటిలో అగ్రగామిగా నిలుస్తుందనడంలో సందేహం లేదు.

- పి విష్ణుకుమార్ రాజు బిజెపి ఏపీ ఫ్లోర్ లీడర్