ఫోకస్

అలజడి నుంచి బయటపడతాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇన్ఫర్మేషన్ రంగంలో అలజడి నెలకొంది. ప్రధానంగా ఐటి రంగంలో రాణించాలనుకునేవారు కొన్ని ప్రాథమిక విషయాలను గుర్తుంచుకోవాలి. ఒకసారి ఉద్యోగంలో చేరిన తర్వాత నాలెడ్జ్‌ని అభివృద్ధి చేసుకోకుండా, ఎక్కడేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంటే గడ్డు పరిస్థితి తప్పదు. ప్రతిరోజూ కొత్త టెక్నాలజీ మెళకువలు నేర్చుకోవాలి. ఐటి కంపెనీలో జీతాలు బాగుంటాయి. ప్రస్తుతం అమెరికాతోపాటు ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలో వస్తున్న మార్పులు తెలిసిందే. దీనివల్ల కొన్ని కంపెనీలు లేఆఫ్‌ను ప్రకటిస్తున్నాయి. ఫ్రెషర్స్‌కు ఏమాత్రం ఢోకాలేదు. ఎప్పటిలాగానే రిక్రూట్‌మెంట్లు కొనసాగుతాయి. పది, పదిహేనేళ్లు పనిచేసిన ఐటి ఉద్యోగులు ఒక ఉన్నతస్థాయికి చేరుకుంటారు. వారి ప్యాకేజీ భారీగా ఉంటుంది. అటువంటి వారిని ఐటి కంపెనీ యాజమాన్యాలు టార్గెట్ చేస్తున్నాయి. వారికి పింక్ స్లిప్‌లను ఇస్తున్నాయి. వారిని ఫోర్త్ రేటింగ్‌లో పెడుతున్నాయి. ఇక్కడ నలుగురిని తొలగిస్తే అమెరికాలో ఒకరికి ఉద్యోగం ఇవ్వవచ్చు. ఒక ఐటి సంస్థ హైదరాబాద్‌లో ఏడువేల మందికి 4వ రేటింగ్ ఇచ్చింది. ఈ రేటింగ్ ఇచ్చిన తర్వాత 60 నుంచి 90 రోజుల్లో ఉద్యోగం నుంచి ఉద్వాసన పలకడం ఖాయమని చెప్పవచ్చు. ఐటి ఉద్యోగులు కూడా ఒక స్థాయికి చేరుకున్న తర్వాత తాము సొంతంగా చిన్న చిన్న కంపెనీలు పెట్టి నలుగురికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలి. నిరంతరం తమ నాలెడ్జ్‌ను మెరుగుపరుచుకుంటూ ఉండాలి. హైదరాబాద్‌లో ఇటీవల జరిగిన పరిణామాలపై లేబర్ కమిషనర్‌ను కలిసి పరిస్థితిని వివరించాం. 26వ తేదీన చర్చలకు రమ్మన్నారు. ఉద్యోగం నుంచి ఉద్వాసన పలకాలంటే ఆరు నెలల వేతనాన్ని అడ్వాన్సుగా ఇవ్వాలని, బీమా సదుపాయాన్ని ఏడాదిపాటు పొడిగించాలని కోరాం. ప్రభుత్వ రంగంలో కూడా అనేక వెబ్‌సైట్లు హ్యాకింగ్‌కు గురవుతున్నాయి. ప్రభుత్వం సైబర్ నిపుణుల సేవలను ఉపయోగించుకోవాలని కోరాం. తాజాగా ఐటి రంగంలో నెలకొన్న పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. వీటిని అధిగమించేందుకు సమష్టిగా క్రమశిక్షణ మార్గంలో ఉద్యమిస్తాం. అదే సమయంలో హైదరాబాద్‌కి అంతర్జాతీయంగా ఉన్న బ్రాండ్‌ను కాపాడుకుంటాం. నాలెడ్జ్ ఉన్న ప్రతి ఐటి నిపుణుడు, ఐటి వర్కర్‌కు ఎప్పటికీ ఢోకా ఉండదు. ఆర్థిక రంగంలో హెచ్చుతగ్గులు, సంపన్న అమెరికా రాజకీయ వ్యవస్థలో వస్తున్న మార్పులవల్ల ఎగుడుదిగుడు పరిస్థితి కొంతకాలమే ఉంటుంది. మెల్లగా అవే సర్దుకుంటాయి.

- మక్తాల సందీప్ కుమార్ గ్లోబల్ ప్రెసిడెంట్ తెలంగాణ ఇన్ఫర్‌మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ (టీటా)