ఫోకస్

వైరస్‌తోనే ఇక యుద్ధాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనం కంప్యూటర్లలో అద్భుతాలు సృష్టిస్తున్నప్పటికీ కంప్యూటర్ వైరస్‌లను ఎదుర్కొనే సామర్థ్యంలో వెనుకబడి ఉన్నాం. ఇప్పటివరకు కంప్యూటర్ రంగంలో అప్లికేషన్ ఒరియంటెడ్, డెవలప్‌మెంట్‌వైపు మాత్రమే దృష్టి సారించాం. ఇటీవల సృషించిన రాన్‌సమ్ వైరస్ తదితర వాటివల్ల అనేక దేశాలు ఇబ్బందులను ఎదుర్కొన్నాయి. ప్రస్తుత తరుణంలో ఐటి రంగంలో సైబర్ సెక్యూరిటీకి సంబంధించి అనే్వషణలు చేపట్టాల్సి ఉంది. సైబర్ సెక్యూరిటీ వంటివాటిలో ఇప్పటివరకు కమ్యూనికేషన్‌లో అంత సీరియస్‌గా దృష్టి పెట్టలేదు. రాబోయే కాలంలో విద్యార్థులు సైబర్ సెక్యూరిటీని అధిగమించే విధంగా తయారుకావాల్సిన అవసరం ఉంది. ప్రస్తుత తరుణంలో ఇటువంటి వైరస్‌లనుంచి తప్పించుకోవాలంటే ఫేక్ మెయిల్స్‌ను ఓపెన్ చేయరాదు. మీకు ఫలానా ఆఫర్ ఇస్తున్నాము. మీకు లాటరీ తగిలింది ఇటువంటి వదంతులు నమ్మి ఆ మెయిల్‌ను ఓపెన్ చేస్తే దానిద్వారా వైరస్ కంప్యూటర్‌లోకి చేరుతుంది. ఆ తరువాత డేటా లాంగ్వేజీ మారిపోతుంది. దీనివల్ల తిరిగి మన డేటా ఓపెన్ చేస్తే మనకు ఏ రకమైన వివరాలు అందుబాటులో ఉండవు. వేరే లాంగ్వేజీ ఎన్‌క్రిప్ట్ అవుతుంది. దానిని డిక్రిప్ట్ చేయాలంటే వారు అడిగినంత మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. లేనిచో ఆ లాంగ్వేజీ మారే పరిస్థితి ఉండదు. అన్‌వాంటెడ్ మెయిల్స్‌ను ఓపెన్ చేయకుండా ఉండాలి. రానున్న కాలంలో ఇతర దేశాలపైకి యుద్ధాలు చేయాలంటే ముఖ్యంగా కంప్యూటర్ వైరస్‌లతోనే ఆ దేశాన్ని కకావికలం చేసే పరిస్థితులు ఎదురయ్యే ప్రమాదం ఉంది. ఇప్పటికైనా కంప్యూటర్ రంగంలో ఎంత ముందుకు దూసుకుపోయామో, వాటి వైరస్‌లవల్ల అంత భయపడుతున్నాం. ఆ పరిస్థితిని ధీటుగా ఎదుర్కొనే సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. ఇటీవల రాన్‌సమ్ వైరస్ కారణంగా అనేక దేశాలు ఇబ్బందులను ఎదుర్కొన్నాయి. వాన్నాక్రై కూడా దానిని తిప్పికొట్టేందుకు పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లించాలని కోరింది. ఈ విధమైన ఇబ్బందులు తలెత్తకుండా భారత్ దేశానికి తగిన భద్రతను కల్పించాల్సిన అవసరం ఉంది.

- ప్రొఫెసర్ ఆర్.రాజేశ్వరరావు సిఎస్‌ఇ హెడ్, జెఎన్‌టియు, విజయనగరం