ఫోకస్

షట్‌డౌన్ సరిగా చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాంకేతిక పరిజ్ఞానం ఎంతగా అందుబాటులోకి వచ్చిందో సమస్యలు కూడా అంతే వేగంగా పురోగమిస్తున్నాయి. కంప్యూటర్ సహా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడంలో కొద్ది పాటి జాగ్రత్తలు పాటించడంతో పాటు అప్రమత్తంగా ఉంటే ఈ సమస్యలను 90 శాతం అధిగమించవచ్చు. ముఖ్యంగా కంప్యూటర్ ఉపయోగించే వ్యక్తులు, సంస్థలు విధిగా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. తాము ఉపయోగించే కంప్యూటర్లు హ్యాక్ కాకుండా చూసుకోవాలి. కంప్యూటర్లను వైరస్ నుంచి కాపాడుకునేందుకు ఎప్పటికప్పుడు యాంటీ వైరస్‌ను ఉపయోగించాలి. వ్యక్తులు, సంస్థలు ఉపయోగించే కంప్యూటర్లలో ‘ఫైర్‌వాల్స్’ను ఏర్పాటు చేసుకోవాలి. అలాగే సంస్థలు, కీలక ప్రభుత్వ శాఖలు తమ సైట్లు హ్యాక్ కాకుండా అందుబాటులో ఉన్న సాంకేతిక అంశాలను వినియోగించుకోవాలి. కంప్యూటర్‌ను వినియోగించడం పూర్తయిన తరువాత సరైన విధానంలో దాన్ని షట్‌డౌన్ చేయాలి. అలాగే వ్యక్తులు, సంస్థలు తమ ఈ మెయిల్ ఐడిని, పాస్‌వర్డ్‌ను ఎవరికీ ఇవ్వకూడదు. తరచు పాస్‌వర్డ్ మారుస్తూ ఉండాలి. సులభమైన పాస్‌వర్డ్ కాకుండా, ఎవరికీ అర్ధంకాని విధంగా పాస్‌వర్డ్‌ను ఎంచుకోవాలి. ప్రస్తుతం కంప్యూటర్‌ను వినియోగిస్తున్న వారిలో అత్యధికులు యువతే. వీరిలో కొంతమంది ఆలోచనలు నేర ప్రవృత్తిని ప్రేరేపించడం వల్ల సైబర్ నేరాల సంఖ్య పెరుగుతూ వస్తోంది. సంస్థలు, వ్యక్తులకు చెందిన సైట్లు, ఇతర సమాచారం హ్యాక్ చేయకుండా ఉండేందుకు వీలుగా చర్యలు తీసుకునే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోంది. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ నిపుణులు, సాఫ్ట్‌వేర్ ప్రముఖులతో కలిసి అధ్యయనం చేసి కొన్ని విధి విధానాలను రూపొందించనుంది. విద్యార్థి దశలోనే వీటిని యువతకు అలవరచడం ద్వారా సమస్యను కొంతమేరైనా నియంత్రించే అవకాశం ఉంది.

- శ్రీ్ధర రెడ్డి, సిఇఓ, మిలీనియం సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్