ఫోకస్

అప్రమత్తమే.. మరోమార్గం లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచవ్యాప్తంగా బెంబేలెత్తించిన వన్నాక్రై వంటి ముప్పు ఎప్పుడూ పొంచే ఉంటుంది. ఈసారి వన్నాక్రై కావచ్చు.. మరోసారి ఇంకోటి కావచ్చు. పేరు ఏదైనా కంప్యూటర్ సాఫ్ట్‌వేర్లకు హ్యాకింగ్ సమస్య అనేది ఎప్పుడూ ఉంటుంది. దీని బారిన పడటమా? పడక పోవడటమా? అనేది మన చేతుల్లో ఉంటుంది. ఉచితంగా పైరసీ సాఫ్ట్‌వేర్లను పొందాలనుకునే వారికి, ఉచితంగా సినిమాలు, పాటలు డౌన్‌లోడ్ చేయాలనుకునే బలహీనతను ఆసరా చేసుకునే హ్యాకింగ్ దాడి జరుగుతుంది. కంప్యూటర్లు, లాప్‌టాప్‌లు, మొబైల్ సాఫ్ట్‌వేర్లు సులువుగా హ్యాకింగ్‌కు గురవుతాయి. వీటిని వినియోగించుకునేవారు అప్రమత్తంగా లేకపోతే చాలా అనర్థాలు జరగడానికి అవకాశం ఉంటుంది. ఈ సమస్య ఇటీవల వచ్చింది కాదు. నాలుగు ఐదు సంవత్సరాల కిందటనే ప్రపంచవ్యాప్తంగా హ్యాకింగ్ సమస్య మొదలైంది. వాస్తవానికి వన్నాక్రై అనేది యుఎస్ ప్రభుత్వ నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ తయారు చేసింది. యుఎస్ ప్రభుత్వం తమ దేశ భద్రతలో భాగంగా కంప్యూటర్ సాఫ్ట్‌వేర్‌ను హ్యాకింగ్ చేయడానికి దీనిని రూపొందించింది. అయితే ఈ టూల్స్‌ను కొందరు దొంగిలించి సాఫ్ట్‌వేర్ చోర్యానికి వడిగట్టారు. ప్రధానంగా హ్యాకింగ్‌కు గురయ్యేది పర్సనల్ కంప్యూటర్సే ఉంటాయి. ఆన్‌లైన్‌లో కనిపించే ఏదంటే దానిని గుడ్డిగా డౌన్‌లోడ్ చేసుకోకూడదు. మోసగాళ్లు రకరకాల పేర్లతో, ఆసక్తి కలిగించే అంశాలను ఆసరగా చేసుకొని హ్యాకింగ్‌కు పాల్పడుతుంటారు. ఒక్కసారి హ్యాకింగ్‌కు గురైతే ఇక చేసేది ఏమి ఉండదు. ఆగంతకులకు డబ్బులు చెల్లించడం తప్ప మరోమార్గం ఉండదు. కంప్యూటర్ సాఫ్ట్‌వేర్లలోకి చోరబడి డాటాను హ్యాకింగ్ చేసి డబ్బులు డిమాండ్ చేసే వారిని పట్టుకోవడం కూడా సాధ్యపడదు. డబ్బులు ఎవరికి చెల్లిస్తున్నమో వారిని ట్రాక్ చేసి పట్టుకోలేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితిలో కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, మొబైల్‌లో నెట్ వాడే వారు అప్రమత్తంగా ఉండటంతప్ప మార్గం లేదు.

- నల్లమోతు శ్రీ్ధర్, ఐటి నిపుణుడు