ఫోకస్

తీవ్రవాదం సామాజిక సమస్య.. ఉగ్రవాదం అంతర్జాతీయ సమస్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉగ్రవాదం, తీవ్రవాదం జాతీయ ప్రయోజనాలను విచ్ఛిన్నం చేస్తాయి. అభివృద్ధి కుంటుపడుతుంది. సమాజంలో అశాంతి నెలకొంటుంది. హింసకు ప్రతి హింస సమాధానం కాదు. మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం. ఉగ్రవాదం, తీవ్రవాదం కేవలం భారత్ లేదా ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల సమస్య కాదు. ఇది అంతర్జాతీయ సమస్యగా పరిణమించింది. ప్రస్తుతం ఆంధ్ర, తెలంగాణలో వామపక్ష తీవ్రవాదం మెల్లిమెల్లిగా మళ్లీ విస్తరిస్తోంది. వామపక్ష తీవ్రవాదంలో మన సమాజంలో మన చుట్టూ ఉండే యువతనే చేరుతున్నారు. అంటే సామాజిక సమస్యగా మనం పరిగణించాలి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 2004లో అధికారంలోకి వచ్చిన వెంటనే అప్పటి పీపుల్స్‌వార్, మావోయిస్టు పార్టీ నేతలను చర్చకు ఆహ్వానించారు. చర్చలు జరిగాయి. దీనివల్ల చాలామంది యువత జనజీవన స్రవంతిలోకి వచ్చారు. మావోయిస్టులు కూడా ఆయుధాలను విసర్జించాలి. హింసవల్ల లక్ష్యాలను సాధించలేరు. ప్రజాస్వామ్య స్రవంతిలోకి రావాలి. తెలంగాణ రాష్ట్రం వామపక్ష తీవ్రవాదంవల్ల నాలుగు దశాబ్దాలు నష్టపోయింది. మన యువకులు, యువతులు అనేకమంది ఎన్‌కౌంటర్లలో మరణించారు. అదే విధంగా పోలీసు సోదరులు కూడా నేలకొరిగారు. సమాజంలో అసమానతలు రూపుమాపడం, అభివృద్ధి ఫలాలు అన్ని వర్గాలకు అందించే విధంగా చర్యలు తీసుకోవాలి. పుండు ఒకచోట ఉంటే మందు ఒకచోట రాస్తే ఉపయోగం ఉండదు. అలాగే మావోయిస్టులను జనజీవన స్రవంతిలోకి వచ్చేవిధంగా నిరంతరం చర్చల ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించాలి. భూసంస్కరణలను అమలుచేయాలి. వికేంద్రీకరణతో కూడిన అభివృద్ధి ఉండాలి. నక్సలైట్ల హింసాకాండకు రెండు రాష్ట్రాలు విలవిల్లాడాయి. ప్రస్తుతం ఆంధ్రాలో బాక్సైట్ తవ్వకాలపై గొడవ జరుగుతోంది. సమస్యల పరిష్కార దిశగా ఏపి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఇక ఉగ్రవాదం అంతర్జాతీయ సమస్య. కేవలం ఒక మతానికి అంటగట్టరాదు. అన్ని మతాల్లో దురహంకార శక్తులు ఉన్నాయి. కాని అనేక చారిత్రక కారణాల వల్ల హైదరాబాద్ పరిసరాల్లో ఉగ్రవాదుల కదలికలు ఉన్నమాట వాస్తవమే. మైనార్టీ లేదా మెజార్టీ మతోన్మాదం ఏదైనా సమాజానికి ప్రమాదం. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకే కాదు, మన దేశానికి ఉగ్రవాదం, తీవ్రవాదం నుంచి ముప్పు పొంచి ఉంది. మన వరకు మనం లౌకిక ఆలోచన విధానాలను పెంపొందించాలి. పరమత సహనం అవసరం. ఇటీవల గుంటూరులో నకిలీ ఆల్‌ఖైదా సానుభూతిపరుడు అరెస్టయ్యాడు. అలాగే హైదరాబాద్‌లో ఐఎస్ సానుభూతిపరులు కొంతమంది అరెస్టయ్యారు. రెండు రాష్ట్రాల్లో పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా ఉండి విధ్వంసకాండకు పాల్పడే తీవ్ర, ఉగ్రవాద శక్తులను ఏరిపారేయాలి. నిఘా పెంపొందించాలి. ప్రజలతో పోలీసులు సన్నిహితంగా ఉండాలి. ప్రభుత్వాలు లౌకికతత్వ విధానాలను అనుసరించాలి.

- కె శివకుమార్, ప్రధాన కార్యదర్శి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ