ఫోకస్

ఆలయాలను ఆదుకునేదెవరు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందువులకు ఆధ్యాత్మిక కేంద్రాలు దేవాలయాలు, అత్యంత పవిత్రమైన ప్రదేశాలు అవి. వాటి నిర్వహణకు అనేక సంప్రదాయాలు, పద్ధతులు, విధానాలు, నిర్వహణ తీరు తెన్నులు పురాణాలు, ఇతిహాసాల నుండే ఉన్నాయి. శాస్త్ర ప్రకారం భక్తుల సౌకర్యార్ధం భగవంతుడు ఆర్చారూపియై భూలోకానికి వస్తాడని, ప్రతి దేవాలయంలో ద్వారపాలకులు, పరివార దేవతలు, ప్రాకార దేవతలు ఆవాహనతో ఉంటారని చెబుతారు. దేశంలో పేరొందిన దేవాలయాలు 34 వేల వరకూ ఉండగా, రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 200 దేవాలయాలు ప్రసిద్ధి చెందినవే ఉన్నాయి. వీటిలో తిరుపతి, విజయవాడ, అన్నవరం, సింహాచలం, అరసవిల్లి, శ్రీశైలం, ధర్మపురి, వేములవాడ, కీసర, యాదగిరిగుట్టవంటి దాదాపు డజను దేవస్థానాలు పెద్ద సంఖ్యలో భక్తులు సందర్శించేవే ఉన్నాయి. ప్రతి హిందువూ తన జీవన గమనంలో అనునిత్యం దేవాలయాలకు వెళ్లగలిగినా లేకున్నా తన మతవిశ్వాసాలకు అనుగుణంగా తరచూ భగవద్దర్శనం చేసుకుంటూనే ఉంటాడు. కొంతమంది అనునిత్యం దేవాలయాలకు వెళ్లేవారుంటారు. దేవాలయాలకు వెళ్లే ప్రతి భక్తుడు తన శక్తికొద్దీ కానుకలను భగవంతుడికి సమర్పించుకుంటారు. భక్తులు భగవంతుడికి కానుకలు సమర్పించడానికి అనువుగా ఆలయంలో ఒక హుండీ ఉంటుంది. హుండీద్వారా వచ్చిన కానుకలను లెక్కించి, వాటిని బ్యాంకుల్లో దాచి భగవంతుడి అనునిత్యం జరిపే కైంకర్యాలకు ఖర్చు చేస్తారు. మిగిలిన మొత్తాన్ని దేవాలయాల అభివృద్ధికి ఖర్చు చేస్తుంటారు. హిందూ సంప్రదాయంలో మొక్కులు అనాదిగా ఉన్న ఆచారమే. ప్రత్యేక మొక్కులు తీర్చుకునే భక్తులు విలువైన ఆభరణాలు, బంగారం, వెండివి చేయిస్తుంటారు. ప్రతి ఊరిలో, ప్రతి వాడలో నేడు దేవాలయాలున్నాయి. వాటి పరిరక్షణకు, అభివృద్ధికి గతంలో దాతలు భూములు, ఇళ్లు, పొలాలు, ఆస్తులను రాసిచ్చేశారు. వాటి రికార్డులు ఇంత కాలం ఆయా దేవాలయాలకే పరిమితం కావడంతో వాటి భూములు, ఆస్తులు చాలావరకూ అన్యాక్రాంతం అయ్యాయి. ఇపుడిపుడే వాటి వివరాలను ఇంటర్‌నెట్‌లో ఉంచుతున్నారు. ఒకప్పుడు దేవాలయాల పరిరక్షణను స్థానిక సమాజమే చేపట్టేది. కాని నేడు చాలా దేవాలయాలు మరీ ముఖ్యంగా అధిక ఆదాయం వస్తున్న హిందూ దేవాలయాలను మాత్రం రాష్ట్రప్రభుత్వం ఎండోమెంట్ పేరుతో తమ ఆధీనంలో పెట్టుకుని అజమాయిషీ చేస్తోంది. సంపద వస్తున్న దేవాలయాలపై చూపిస్తున్న ప్రభుత్వ శ్రద్ధ సంపద లేని, జీర్ణావస్థలో ఉన్న దేవాలయాలపై మాత్రం కనిపించడం లేదనేది నిర్వివాదాంశం. అనేక హిందూ దేవాలయాల్లో దొంగతనాలు, దోపిడీలు, ఆశ్రీతపక్షపాతం, అక్రమాలు లెక్కలేనన్ని జరుగుతున్నాయి. దేవతామూర్తులపై ఉన్న విలువైన ఆభరణాలను కూడా దోచుకుంటున్నారు. గుప్తనిధుల పేరుతో దేవాలయాలను కూల్చేస్తున్నారు, విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు. కొన్నిసార్లు ప్రభుత్వం దేవాలయాలపై తీసుకునే నిర్ణయాలు హిందువుల మనోభావాలను దెబ్బతీసే రీతిలో ఉంటున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేవాదాయ శాఖ జారీ చేసిన పలు కీలక జీవోలను పక్కన పెట్టింది. వాస్తవానికి గత ఏడాది కాలంలో ఇరు రాష్ట్రప్రభుత్వాలూ దేవాలయాల పరిరక్షణకు విశేషకృషి చేస్తున్నా ఇటు అర్చకుల నుండి అటు భక్తుల నుండి కూడా విమర్శలు వస్తూనే ఉన్నాయి. నిధుల పరిరక్షణ, ఎండోమెంట్ ఉద్యోగుల సర్వీసు రూల్స్‌కు సంబంధించి, ట్రిబ్యునళ్ల ఏర్పాటుకు సంబంధించి, దేవాలయాల పరిరక్షణ చట్టం 30/1987కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేక జీవోలు ఇచ్చింది. అలాగే దేవాలయాల ఆస్తుల పరిరక్షణ, లీజులు, లైసెన్స్‌లకు సంబంధించి కూడా జీవోలు ఇచ్చింది. ఎండోమెంట్ ట్రిబ్యునళ్ల ఏర్పాటు, చారిటబుల్ సంస్థలు, ట్రస్టీలు, ధార్మిక పరిషత్‌లు, చరాస్తుల నియమాలు, దేవాలయాల ఆస్తుల పరిరక్షణ నిబంధనలుపై కూడా ప్రభుత్వం జీవోలు జారీ చేసింది. బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు, భజన మండళ్లు, ధార్మిక పరిషత్ ఏర్పాటు, ధూపదీప నైవేద్యాలు, ఆగమసలహా మండళ్ల ఏర్పాటు తదితర అంశాలపై కూడా ఉత్తర్వులు వచ్చాయి. ఇంత జరిగినా దేవాలయాల పరిరక్షణలో ఏదో వెలితి... ప్రతి ఒక్కరికీ కనిపించే వెలితి... దానిని సవరించడం ఎలా.. ఏం చేయాలి? ఈ అంశంపై ప్రముఖుల సలహాలు, సూచనలే ఈ వారం ఫోకస్.