ఫోకస్

సెక్యూరిటీని పటిష్ఠం చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సైబర్ సెక్యూరిటీ రంగంలో పటిష్టమైన కార్యాచరణ ప్రణాళికను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా రూపొందించుకోవాల్సిన అవసరం ఉంది. భారత్‌లో ఇంతవరకు సైబర్ సెక్యూరిటీకి సంబంధించి జాతీయ స్ధాయిలో కచ్చితమైన పాలసీ లేదు. ఒక రెగ్యులేటరీ అథారిటీని ఏర్పాటు చేయాలి. తాజాగా మన దేశంలో కొన్ని రాష్ట్రాల వెబ్‌సైట్లు, సైబర్ సమాచార వ్యవస్ధను రాన్సమ్‌వేర్ అటాక్ చేసింది. డాటాను తస్కరించడమంటే హ్యాకింగ్ చేయడమంటారు. అదే మన డాటా ఉన్న వ్యవస్ధను స్తంభింపచేయడం, యూజర్‌కు ఉపయోగపడని విధంగా నిరుపయోగంగా సమాచారాన్ని మార్చడాన్ని వైరస్ అటాక్ అంటారు. ఒక దేశ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేయడానికి హ్యాకింగ్, వైరస్ అటాక్‌లు చేస్తారు. ఆన్‌లైన్‌లో బిట్ కాయిన్, పేపాల్ ద్వారా క్రెడిట్ కార్డు నుంచి సొమ్మును బదలాయిస్తే, మీ వ్యవస్థను యదావిధిగా పనిచేసేటట్లు చేస్తామనే హెచ్చరికలు వచ్చాయి. టర్కీ కేంద్రంగా ప్రపంచ వ్యాప్తంగా ఈ దాడులు జరుగుతుంటాయి. రక్షణ రంగం, సైన్స్, టెక్నాలజీ, రైల్వే, అణు ఇంధనం, పోలీసు నేర పరిశోధన, ఆదాయం పన్ను శాఖ ఇలా ఎన్నో శాఖలు కీలకమైనవి ఉన్నాయి. ఆన్‌లైన్ అనధికార బ్యాంకు లావాదేవీలు జరిపే సంస్థలపై అంతర్జాతీయంగా నిషేధించే ప్రతిపాదన ఉంది. మన దేశంలో సైబర్ సెక్యూరిటీ వ్యవస్థను పటిష్టం చేయాల్సి ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని ప్రభుత్వ శాఖల్లో కింది స్థాయిలో అంటే ఎంట్రీ లెవెల్‌లో సైబర్ సెక్యూరిటీ అసోసియేట్స్‌ను తప్పనిసరిగా రిక్రూట్ చేసుకోవాలి. యుపిఎస్‌సి, రాష్ట్ర సర్వీసు కమిషన్లకు సైబర్ సెక్యూరిటీ అసోసియేట్స్ నియామక బాధ్యతలను అప్పగించాలి. వారికి మంచివేతనాలు ఇవ్వాలి. మన దేశంలో బ్యూరోక్రాట్లు, రాజకీయ అధికార వ్యవస్ధలో ఉండే వారి మైండ్ సెట్ మారాలి. కంప్యూటర్ ఆపరేటర్ వేరు, సైబర్ సెక్యూరిటీ అసోసియేట్స్ వేరు. విదేశాల నుంచే కాదు, అంతర్గతంగా వివిధ ప్రైవేట్, ప్రభుత్వ సంస్ధల మధ్య కూడా సమాచార చౌర్యం జరుగుతుంటుంది. కంప్యూటర్ల మయమైన ఈ రోజుల్లో ప్రభుత్వ, ప్రైవేట్, కార్పోరేట్ రంగం అప్రమత్తం కావాలి. లేదంటే హ్యాకింగ్ లేదా వైరస్ అటాక్ ద్వారా కంపెనీల ఐటి సిస్టమ్, డాటా మొత్తం కరప్ట్ అయి పతనమయ్యే అవకాశాలు లేకపోలేదు.

- మక్త్యాల సందీప్ ప్రెసిడెంట్, తెలంగాణ ఐటి అసోసియేషన్