ఫోకస్

ఏ దాడినైనా ఎదుర్కొంటాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కంప్యూటర్ వ్యవస్థపై రాన్సమ్‌వేర్ దాడి దురదృష్టకరం. సాంకేతికత పెరుగుతున్న కొద్దీ దానికి అనుగుణంగానే సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. అత్యాధునిక టెక్నాలజీ కనిపెట్టే దిశగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నిపుణులు ప్రయత్నిస్తున్నారు. అయితే కంప్యూటర్ల భద్రత, అదుపుపై దృష్టి సారించకనే ఇలాంటి సైబర్ దాడులు జరుగుతున్నట్టు భావిస్తున్నాం. డాటాను హ్యాకింగ్ చేయడం మహా నేరం.. కానీ, హ్యాకర్లను గుర్తించడం కూడా అంత కష్టమేమీ కాదు. సంచలనం సృష్టించిన హ్యాకర్లు సాధించిందేమీ లేదు. సమయం వృథా అయిందే తప్ప పెద్ద నష్టమేమీ జరగలేదు. హ్యాకర్లు ఆధునిక పరిజ్ఞానంతో ఎలాగైతే వెబ్‌సైట్లను తస్కరించారో.. అదే స్థాయి టెక్నాలజీ వారిని గుర్తించగలిగింది. సాంకేతికంగా క్లిష్టమైన అంశాల గురించి భారత్‌లో ప్రభుత్వ, రాజకీయ వ్యవస్ధలకు, ప్రజలకు ఉన్న పరిజానం అంతంతమాత్రమే. ఒక దేశ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేయడానికి హ్యాకింగ్, వైరస్ దాడులను ఎదుర్కొనే శక్తి భారత్‌కు ఉంది. ఆన్‌లైన్‌లో బిట్ కాయిన్, పేపాల్ ద్వారా క్రెడిట్ కార్డు నుంచి సొమ్మును బదలాయిస్తే, మీ వ్యవస్థను యదావిధిగా పనిచేసేలా చేస్తామనే హెచ్చరికలు వెలువడ్డాయి. టర్కీ కేంద్రంగా ప్రపంచ వ్యాప్తంగా సైబర్ దాడులు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఆన్‌లైన్ అధికార, అనధికార బ్యాంకు లావాదేవీలు జరిపే సంస్థలు అప్రమత్తంగా ఉండాలి. విదేశాల నుంచే కాకుండా అంతర్గతంగా వివిధ ప్రైవేట్, ప్రభుత్వ సంస్థల మధ్య కూడా సమాచార చౌర్యం జరుగుతుంటుంది. దీనివల్ల సైబర్ క్రైం పెరిగే అవకాశం ఉంటుంది. మారుతున్న కాలానికనుగుణంగా టెక్నాలజీ పెరుగుతోంది.. దానికి అనుగుణంగానే సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. ఇటీవల జరిగిన సైబర్ దాడిలో తెలంగాణ రాష్ట్రానికి ఎలాంటి ప్రమాదం సంభవించలేదు. తెలంగాణ రాష్ట్రంలోని పోలీస్ శాఖ వెబ్‌సైట్లు అన్నీ సురక్షితంగానే ఉన్నాయి. అయితే ప్రేవేటు పరిశ్రమల్లో కొన్ని వెబ్‌సైట్లు హ్యాక్ గురైనట్టు తెలిసింది. కానీ ఎలాంటి ఫిర్యాదు రాలేదు. దేశంలోనే నెంబర్ వన్‌గా రాణిస్తున్న తెలంగాణ పోలీస్‌కు సైబర్ దాడులను కూడా ఎదుర్కొనే శక్తి ఉంది. నేరాలను అదుపు చేయడంతోపాటు ఇలాంటి సైబర్ దాడులను ఎదుర్కోగల సత్తా మనకుందని సగర్వంగా చెప్పుకోవచ్చు.

-మహేందర్‌రెడ్డి కమిషనర్ ఆఫ్ పోలీస్, హైదరాబాద్