ఫోకస్

పైరసీ వల్లే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాన్నాక్రై వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇప్పటి వరకు తెలంగాణలో ఈ వైరస్ ప్రభావం చూపిన సంఘటనలు జరగలేదు. ప్రభుత్వానికి చెందిన సంస్థల కంప్యూటర్లలో ఇప్పటివరకు వైరస్ సోకిన సంఘటనలు లేవు. ప్రైవేటుకు సంబంధించిన సమాచారం ప్రభుత్వానికి అందుబాటులో ఉండదు. ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని ప్రభుత్వ శాఖలకు వైరస్ సోకినట్టు నమోదు అయింది. దేశవ్యాప్తంగా దాదాపు 40వేల కంప్యూటర్లకు ఈ వైరస్ సొకినట్టు ఒక అంచనా. పైరసీకి దూరంగా ఉండడం మంచిది. పైరసీ వల్లనే ఈ వైరస్ వచ్చే అవకాశం ఉంది. తెలంగాణలో ఇప్పటివరకు ఎలాంటి కేసులు నమోదు కాకపోయినా ముందు జాగ్రత్త చర్యలను ప్రభుత్వ కార్యాలయాలు అన్నింటికీ పంపించాం. కేంద్ర ప్రభుత్వం కొన్ని సూచనలు చేసింది, అదేవిధంగా రాష్ట్ర ఐటి శాఖ కూడా జాగ్రత్త చర్యలు సూచించింది. రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడడంలో పోలీసులు, దేశ రక్షణకు సైన్యం ఎంత అవసరమో, ఇప్పుడు కంప్యూటర్లలోని సమాచారం రక్షణకోసం సైబర్ భద్రత అంతే అవసరం. ఈ రోజుల్లో ప్రతిదానికి కంప్యూటర్‌పైనే ఆధారపడుతున్నాం. గ్రామీణ ప్రాంతాల్లో సైతం కంప్యూటర్ వాడకం ఉంది. సైబర్ సెక్యూరిటీ ప్రాధాన్యతను గుర్తించి తెలంగాణ రాష్ట్రం దేశంలో తొలిసారిగా సైబర్ సెక్యూరిటీ పాలసీ తీసుకు వచ్చింది. సైబర్ క్రైమ్‌ను నివారించడంతోపాటు, సైబర్ సెక్యూరిటీపై నిపుణుల అవసరం ఉంది. ఈ అంశాలపై ముందు శిక్షణ నిర్వహించాలి. వాన్నాక్రై వ్యాపించకుండా ఎవరికి వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పైరసీ సాఫ్ట్‌వేర్‌లు ఉపయోగించడం అనేది కొందరికి సాధారణ అంశంగా మారిపోయింది. సాఫ్ట్‌వేర్‌ను కొనుక్కొని ఒరిజినల్‌ది మాత్రమే ఉపయోగించాలి. ఉచితంగా లభిస్తుందని పైరసీ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగిస్తే ఇలాంటి భారీ నష్టాలు తప్పవు. విండోస్ వంటివి ఒరిజినల్ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగిస్తే, వైరస్‌లు రాకుండా ఎప్పటికప్పుడు చూస్తుంది. అదే పైరేటెడ్ సాఫ్ట్‌వేర్‌లో ఈ సౌకర్యం ఉండదు. ప్రతి పదిహేను రోజులకు ఒకసారి వైరస్‌ను అడ్డుకునే సాఫ్ట్‌వేర్ ఆటోమెటిక్‌గా కంప్యూటర్‌లో అప్‌లోడ్ అవుతుంది.
ఇటీవల కాలంలో వైరస్‌ను బ్లాక్‌మెయిల్‌కు ఉపయోగించుకుంటున్నారు. వాన్నాక్రై సైతం అదే విధంగా బ్లాక్‌మెయిల్‌కోసం ఉపయోగించుకుంటున్నారు. కంప్యూటర్‌పై ఈ వైరస్‌తో దాడి చేసినవారు అడిగిన మొత్తం డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఒక వ్యక్తిని కిడ్నాప్ చేసి వదిలివేయాలని డబ్బు డిమాండ్ చేసినట్టుగా వైరస్ ద్వారా కంప్యూటర్‌ను హ్యాక్ చేసి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. పైరసీకి దూరంగా ఉండడం, అనుమానిత మెయిల్స్‌ను ఓపెన్ చేయక పోవడం వంటి జాగ్రత్తలతో వైరస్‌కు దూరంగా ఉండాలి.

- కొణతం దిలీప్ తెలంగాణ ప్రభుత్వ డిజిటల్ మీడియా డైరెక్టర్