ఫోకస్

అప్రమత్తమైతే సమాచారం భద్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం రోజురోజుకూ అభివృద్ధి చెందుతున్న తరుణంలో సామాన్యులకు సైతం కంప్యూటర్లు, సెల్‌ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా వీటి వినియోగం బాగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో వ్యక్తిగతంగానే కాకుండా వివిధ సంస్థలు, ప్రభుత్వేతర, ప్రభుత్వ శాఖలు, రక్షణ రంగం వంటి వాటిలో డేటా (సమాచారం) నిక్షిప్తం చేసుకోవడం తప్పనిసరైంది. ఇదే సమయంలో ఉగ్రవాద కార్యకలాపాలు పెరిగే అవకాశం ఉంది. వ్యక్తిగత, దేశ రహస్య సమాచారం మొత్తం హ్యాక్ చేసే ప్రమాదం ఏర్పడింది. ప్రస్తుతం వాడుతున్న ఆండ్రాయిడ్ సెల్‌ఫోన్లలో సెక్యూరిటీ ఫీచర్స్ ప్రత్యేకంగా ఉండటం లేదు. అలాగే కంప్యూటర్లలో సైతం అన్‌లైసెన్స్‌డ్ యూసేజ్ ఆపరేటింగ్ సిస్టిమ్స్ అనేక మంది వాడుతున్నారు. ఇది చాలా ప్రమాదకరం. గుర్తింపు పొందిన కంపెనీలు అన్ని రకాల భద్రతా చర్యలతో అభివృద్ధి చేసిన లైసెన్స్‌డ్ ఆపరేటింగ్ సిస్టమ్స్‌ను వాడటం శ్రేయస్కరం. అనధికారిక సంస్థలు లేదా అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చిన ఎలాంటి ఫైల్స్‌ను (ఈ ఎక్స్‌ఇ వంటివి) డౌన్‌లోడ్ చేయరాదు. అందులో రహస్య సంకేతంతో కూడిన వార్మ్స్, మాల్‌వేర్స్ ఉంటాయి. తెలియని వ్యక్తులు పంపే ఇఎక్స్‌ఇ ఫైల్స్‌ను కూడా ఓపెన్ చేయరాదు. అలా చేస్తే అందులోని వైరస్ కంప్యూటర్లకు సోకుతుంది. తద్వారా రహస్య సమాచారం మొత్తం హ్యాక్‌కు గురవుతుంది. లైసెన్స్ ఆపరేటింగ్ సిస్టమ్స్, యాంటీ వైరస్, యాంటీ మాల్‌వేర్ సిస్టమ్స్‌ను తరచూ అప్‌డేట్ చేసుకుంటూ ఉండాలి. అలాగే బ్యాకప్ ఏ రోజుకారోజు తీసుకుంటూ ఉండాలి. ఎక్స్‌టర్నల్ హార్డ్ డిస్క్‌లో, ఓపెన్ సోర్స్‌లో భద్రపర్చుకోవాలి. యూబుంటు, లైనెక్స్ వంటివి వాడటం వల్ల వైరస్ నుంచి రక్షణ పొందవచ్చు. ఫైర్ వాల్స్, సెక్యూరిటీ సిస్టమ్స్ తప్పనిసరిగా ఇన్‌స్టాల్ చేసుకోవాలి. లేకుంటే సెక్యూరిటీ సమస్య తలెత్తుతుంది. ఇన్‌పుట్ డేటా మిస్ అయ్యే ప్రమాదం ఏర్పడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో రక్షణ రంగం, పోలీసు వ్యవస్థ తదితరాల్లో అయితే నేరస్తుల సమాచారం గల్లంతవడం, వారు తప్పించుకునేందుకు ఆస్కారం ఏర్పడుతుంది. చైనా సెల్‌ఫోన్లు అధికంగా మార్కెట్లో వినియోగిస్తున్నందున వాటి ద్వారా కూడా వైరస్‌ను విద్రోహులు విస్తరించే ప్రమాదం లేకపోలేదు. దీంతో పాస్‌వర్డ్స్‌తో పాటు సెక్యూరిటీ, బ్యాంకుల డేటా అపహరణకు గురవుతాయి. కనుక కనీస సమాచార రక్షణ వ్యవస్థలను ప్రతి ఒక్కరూ వాడుకోవాలి. మైక్రోసాఫ్ట్ కంపెనీ ప్యాచ్ ఫైల్స్‌ను రిలీజ్ చేశారు. వాటిని వినియోగించుకోవచ్చు. ఇఎక్స్‌ఇ, డిఒసి(డాక్యుమెంట్) డాట్(.)పిడిఎఫ్, డాట్ (.)జెపిజి లాంటి ఫైల్స్ ఓపెన్ చేయవచ్చు. కంప్యూటర్ వినియోగదారుల్ని ఏమారుస్తూ డాట్ (.) ఇఎక్స్‌ఇ, డాట్ (.) ఎంఎస్‌ఐ, డాట్ (.)డిఎల్‌ఎల్ వంటి ఫైల్స్‌ను అజ్ఞాత వ్యక్తులు పంపుతుంటారు. వీటిని ఓపెన్ చేయడం మంచిది కాదు. అలాగే హెట్‌టిటిపి అని ఉంటేనే ఫైల్స్ ఓపెన్ చేయాలి. కేవలం హెచ్‌టిటిపి అని మాత్రమే ఉంటే అది సమాచారం చోరీ చేసేందుకు లేదా హైడ్ చేసేందుకు వాడేదిగా గుర్తించాలి. అంతేకాకుండా డూప్లికెట్ వెబ్‌సైట్స్ వస్తుంటాయి. వాటిని పట్ల అప్రమత్తంగా ఉండాలి. వాటిని ఎపెన్ చేయరాదు. అలాగే మైక్రోసాఫ్ట్‌లో ఆంగ్ల అక్షరం ‘ఒ’(0) బదులు జీరో(0) ఉంటుంది. ఈ తేడాను గుర్తించి జాగ్రత్త పడాలి. కొన్ని రకాల చైనా ఫోన్స్ ఉపయోగించక పోవడం వల్ల సమాచారం సురక్షితంగా ఉంటుంది.

- ప్రొఫెసర్ ఎస్.వసుంధర హెచ్‌ఓడి, సిఎస్‌ఇ విభాగం, జెఎన్‌టియు, అనంతపురం.