ఫోకస్

బూచాళ్లతో జాగ్రత్త!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆధునీకరణ కాబడిన సాంకేతిక పరిజ్ఞానం, సమాచార రంగం అభివృద్ధి చెందడంలో భాగంగా, ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్ధలు అత్యంత కీలకమైన సమాచారమంతా కూడా వారి సర్వర్లలో, క్లౌడ్ టెక్నాలజీలో భద్రపరచుకుంటున్నారు. ఈ సమాచారాన్ని అంతా ఇంటర్నెట్ ద్వారా సమకూర్చుకోవడంతో పాటు రోజువారీ కార్యకలాపాల్లో వినియోగించుకుంటున్నారు. ఇటువంటి తరుణంలో సైబర్ నేరగాళ్ళు కీలకమైన సమాచారాన్ని హ్యాక్ చేయడం జరుగుతున్నది. లేదా మాల్‌వేర్‌ను ప్రవేశపెట్టి ఆ సమాచారాన్ని ఆ హ్యాకర్లు వారి నియంత్రణలోకి తీసుకుని బ్లాక్‌మెయిల్ చేయడం, తదితర అరాచకాలకు పాల్పడుతున్నారు. ఈ మధ్య మనం వింటున్న ర్యాన్‌సమ్ ఈ కోవకు చెందినదే. సాంకేతిక పరిజ్ఞానం ఎంతగా అభివృద్ధి చెందిందంటే హ్యాకర్లు లేకుండా, వైరస్ లేకుండా చేయడం సాధ్యం కాదు. కానీ ఈ వైరస్‌ల వల్ల, హాకర్ల వల్ల ఎదురవుతున్న ప్రమాదాలను ఎదుర్కొవడం నిరంతరం సమాయత్తం కావడం అవశ్యకత ఉంది. వైరస్ లేని టెక్నాలజీ ఉండదు, అదేవిధంగా హ్యాకర్లు లేకుండా ఉండరు. ఇంటర్నెట్ పెరిగిన కొద్దీ ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకింగ్ సంస్ధల్లో మనకు సంబంధించిన అత్యంత కీలకమైన సమాచారాన్ని భద్రపరుస్తున్నారు. వైరస్ నియంత్రణ, హ్యాకర్ల నుంచి కాపాడుకోవాలన్న అవగాహన అవసరం. ఇంతకుముందు రెండు దేశాల మధ్య తుపాకులు, బాంబులతో యుద్ధాలు జరిగేవి. ఇప్పుడు దేశాల మధ్య సైబర్ యుద్ధాలు జరిగే ప్రమాదం ఉంది. కాబట్టి సైబర్ సెక్యురిటీ పట్ల ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్ధలు లోతైన ఆలోచన, పరిశోధన చేయాల్సిన అవసరం ఉంది. ఇందుకుగాను ఆ సంస్థలు వారి ఉద్యోగులకు అవగాహన కల్పించాలి, అవసరమైన మేరకు ప్రపంచ స్థాయి శిక్షణ ఇవ్వాలి. డార్క్ వెబ్‌లో జరుగుతున్న పరిణామాలను నిరంతరం ట్రాక్ చేస్తుండాలి. వైరస్, హ్యాకింగ్ కేవలం సమాచారం మాత్రమే దొంగలిస్తున్నారని తేలిగ్గా తీసుకోరాదు. ఇది దేశ ఆర్థిక మూలాలను సైతం విధ్వంసం చేయగలిగే అతి పెద్ద ప్రమాదం అని గుర్తించాలి. ఇందుకు చట్టాలను ఇంకా కఠినతరం చేయాల్సిన అవసరం ఉంది. దేశ భద్రత కోసం సైనిక దళాలు ఉన్నట్లే సైబర్ సెక్యురిటీ ఫోర్సెస్‌ను, సివిల్ పోలీసు తరహాలో ప్రత్యేకంగా సైబర్ పోలీసు విభాగాలను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. వారికి సరైన రీతిలో అవగాహన కల్పించడం, అంతర్జాతీయ స్థాయిలో శిక్షణ ఇప్పించి, నిరంతరం సైబర్ సైనికుల వలే తీర్చి దిద్దాలి. దొంగలు లేని సమాజం లేనట్లే హ్యాకర్లు, వైరస్ లేని వ్యవస్థ ఉండదు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సైబర్ దాడులు ఉండవని చెప్పలేం. వాటి నుంచి మరింత సమర్థవంతగా కాపాడుకోవడమే లక్ష్యంగా జాగ్రత్తలు తీసుకోవాలి.

- ప్రొఫెసర్ శ్రవణ్ దాసోజు ప్రధాన కార్యదర్శి తెలంగాణ కాంగ్రెస్