ఫోకస్

వైరస్‌ద్వారా గూఢచర్యం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇటీవలి కాలంలో రోజూ వినే మాట వైరస్... ఇది మనిషి ఆరోగ్యానికి సంబంధించిన వైరస్ కాదు... మనతోపాటు విడదీయరాని అనుబంధాన్ని పెనవేసుకున్న కంప్యూటర్ల వైరస్... ఈ మధ్య వన్నాక్రై కంప్యూటర్ వైరస్‌తో ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. లక్షలాది కంప్యూటర్లు అకస్మాత్తుగా నిలిచిపోయాయి. ఈ సెగ రెండు తెలుగు రాష్ట్రాలకూ వ్యాపించింది. దాంతో తెలుగు రాష్ట్రాల్లో కంప్యూటర్లను కాపాడుకోవడం, డాటాను సురక్షితంగా ఉంచుకోవడంపై దృష్టిపడింది. ఇంటర్నెట్‌పై ఆధారపడి జీవిస్తున్న నేటి ఆధునిక కమ్యూనికేషన్ ప్రపంచంలో సెకెనుకో వైరస్ దాడి కంప్యూటర్ ప్రపంచాన్ని కలవరపాటుకు గురిచేస్తోంది. కంప్యూటర్ వైరస్ అనేది తనకు తానే కాపీ చేసుకుని కంప్యూటర్ యజమాని అనుమతి లేదా అవగాహన లేకుండానే కంప్యూటర్లకు నష్టం కలిగించే ఒక ప్రోగ్రాం. అంటే వైరస్ అనేది హానికరమైన ప్రోగ్రాం. ఒక చెడు ఉద్దేశంతో రూపొందించిన ప్రోగ్రాం అది. నిజ జీవితంలో వైరస్ మాదిరే కంప్యూటర్‌ను వాడేవారికి తెలియకుండానే తన సంఖ్యను పెంచుకుంటుంది. ప్రస్తుతం వైరస్ అనేది పొరపాటుగా పునరుత్పత్తి చేసుకునే సామర్థ్యం లేని ఇతర రకరకాల ప్రొగ్రాంలు మాల్వేర్, యాడ్వేర్, స్పైవేర్‌లకు కూడా వాడుతున్నారు. నిజమైన వైరస్ మాత్రమే ఒక కంప్యూటర్ నుండి మరో కంప్యూటర్‌కు వ్యాపిస్తుంది. సాధారణంగా సిడి డిస్క్, పెన్ డ్రైవ్ వంటి స్టోరేజీ పరికరాలతో అది సోకుతుంది. నిజానికి వైరస్ దానంతట అది పనిచేయదు. వేరే ప్రోగ్రాంలను అంటిపెట్టుకుని ఉంటుంది. ఆ ప్రోగ్రాంలు ఎగ్జిక్యూట్ అయిన ప్రతిసారీ మరికొన్ని ప్రోగ్రాంలకు వ్యాపించేందుకు వైరస్ ప్రయత్నిస్తుంది. అది కంప్యూటర్‌లోకి చొరబడినట్టయితే డివైస్‌లలోని డేటాతోపాటు ఆపరేటింగ్ సిస్టంను పూర్తిగా ధ్వంసం చేసేస్తుంది. వైరస్ అనేది చాలా రకాలుగా ఉంటుంది. వీటిస్థాయిని బట్టి ప్రమాద తీవ్రత ఉంటుంది. ఐటి రంగం ఎంతగా అభివృద్ధి చెందుతోందో అంతే తీవ్రస్థాయిలో వైరస్‌లు విజృంభిస్తున్నాయి. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నాయి. తాజాగా మనం వింటున్న పేరు వన్నాక్రై. ఇది కొరియాకు చెందిందని కొందరు, అమెరికా జాతీయ భద్రతా ఏజన్సీనే దీనిని వ్యాపింప చేసిందని మరికొందరు చెబుతున్నారు. వన్నాక్రై దాడికి గురైనపుడు మైక్రోసాఫ్ట్ విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో వైరస్ దాడికి వీలుకల్పించే అంశాన్ని అమెరికా జాతీయ భద్రతా ఏజన్సీ పరిశోధకులు గమనించారు. వన్నాక్రై కంప్యూటర్ వైరస్‌లో హాకింగ్‌కోసం వాడిన టూల్స్ ఇతర రాన్‌సమ్‌వేర్ కంటే మరింత ప్రమాదకరమైనవి. సైబర్ వ్యవస్థలపై ఆధిపత్యం చెలాయించే ప్రయత్నంలో భాగంగా ప్రపంచ ప్రజలపై గూఢచర్య కార్యకలాపాలు జరుగుతున్నాయనేది సుస్పష్టం. ఈ అంశంపై కొంతమంది నిపుణులు, ప్రముఖుల అభిప్రాయాలే ఈ వారం ఫోకస్.