ఫోకస్

ప్రజల ఆకాంక్షలకు ప్రతిబింబం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలుచేస్తోంది. ప్రజా శ్రేయస్సే ధ్యేయంగా ఎన్నికల హామీలతోపాటు హామీలు ఇవ్వని పలు కార్యక్రమాలను కూడా చేపడుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు పాలన ప్రజా రంజక పాలనకు ప్రతిబంబం. లోటు బడ్జెట్‌తో ఉన్నప్పటికీ రాష్ట్రాన్ని దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిపేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. ప్రతిపక్ష వైకాపా అనవసర రాద్దాంతం చేస్తోంది. పరిశ్రమల స్థాపన, పోలవరం వంటి భారీ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టి భావి తరాలకు కూడా ఇబ్బంది లేకుండా చేస్తున్న ఏకైన ప్రభుత్వం టిడిపి ప్రభుత్వమే. రాబోయే రోజుల్లో నదుల అనుసంధానం పూర్తి చేయడమే ప్రభుత్వ లక్ష్యం. తాగు, సాగునీటి సమస్య లేకుండా చేయనున్నాం. ఎన్నడూ అనంతపురం జిల్లాకు రాని రీతిలో హంద్రీ నీవా ద్వారా 35 టిఎంసిల నీటిని తెప్పించాము. రూ.13,500 కోట్ల భారీ వ్యయంతో కరవు జిల్లా అనంతపురంలో ఆటోమొబైల్ దిగ్గజం కియా కార్ల పరిశ్రమను ఏర్పాటు చేయబోతున్నాం. రూ.1.50 లక్షల రుణమాఫీలో వెనుకంజ వేయడం లేదు. చంద్రన్న బీమా పేదల పాలిట వరం. తాగునీటి ఎద్దడి లేకుండా ప్రతి గ్రామంలోనూ ప్రజలకు రక్షిత మంచినీటిని అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. నదుల అనుసంధానం ద్వారా నీటిని మళ్లించి చెరువులన్నింటినీ నింపడమే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు పోతోంది. రానున్న రోజుల్లో తెలుగుదేశం ప్రభుత్వం ప్రజల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టబోతోంది.

- హనుమంతరాయ చౌదరి ఎమ్మెల్యే, అనంతపురం జిల్లా టిడిపి మాజీ అధ్యక్షుడు