ఫోకస్

స్పష్టమైన అడుగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అపార పరిపాలనా అనుభవం ఉన్న చంద్రబాబునాయుడ్ని ముఖ్యమంత్రిగా ఎన్నుకోవటంలోనే ఆంధ్రప్రజల విజ్ఞత స్పష్టంగా బయటపడింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన తరుణంలోనే నూతనంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్ బంగారుమయం అవుతుందన్న అంశం ఖరారయ్యింది. దానికి తగ్గట్టుగానే ముఖ్యమంత్రి రాష్ట్ర సమగ్రాభివృద్ధితోపాటు ఉపాధి అవకాశాలను మెరుగుపర్చడానికి గత మూడేళ్లుగా నిరంతరం శ్రమిస్తూనే ఉన్నారు. దేశంలో ఉన్న ముఖ్యమంత్రుల్లో చంద్రబాబు మాదిరిగా రాష్ట్ర అభివృద్ధికోసం అన్ని దేశాలు, అంతమంది పరిశ్రమల అధిపతులను కలిసి విజ్ఞప్తి చేసినవారు మరొకరు లేరంటే ఆతిశయోక్తి కాదేమో. ఇటీవలే అమెరికా వెళ్లి ప్రపంచంలోనే అత్యుత్తమ కంపెనీల అధిపతులను స్వయంగా కలిసి వారిని రాష్ట్రానికి ఆహ్వానించారు. ఈ విధంగా గత మూడేళ్లుగా ముఖ్యమంత్రి శ్రమిస్తూనే ఉన్నారు. దానికి ఫలితాలు ఇప్పుడే మొదలయ్యాయనే చెప్పాలి. దీంతో మూడేళ్ల క్రితం ఆవిర్భవించిన ఆంధ్రప్రదేశ్ ఇంకా శైశవదశ దాటకపోయినా అభివృద్ధిపథంలో మాత్రం స్పష్టమైన అడుగులు వేయగలిగింది. ఇక చంద్రబాబు నిరంతరం శ్రమిస్తూ, తపిస్తున్న పోలవరం ప్రాజెక్టు, అమరావతి నూతన రాజధాని నిర్మాణాలు దాదాపుగా ఒక కొలిక్కివచ్చి మరో ఏడాదిలో పూర్తిస్థాయి ఆకారాన్ని సంతరించుకునే పరిస్థితులు స్పష్టమయ్యాయి. అన్ని నియోజకవర్గాలకు సమప్రాధాన్యత ఇస్తూ అయా ప్రాంతాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకువెళుతున్నారు. అయా ప్రాంతాల సామర్ధ్యం, వనరులను పరిగణనలోకి తీసుకుంటూ వాటిని మరింత అభివృద్ధిచేస్తూ రాష్ట్ర స్థూల ఉత్పత్తికి ఇతోధికంగా సహకరించే విధంగా వాటిని అభివృద్ధిచేస్తూ ముందుకు సాగుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో అన్ని వర్గాలను దగ్గర చేర్చుకుంటూ వారి అభ్యున్నతికి బాటలు వేస్తున్నారు. దానిలో భాగంగానే పలు వర్గాలకు కార్పొరేషన్లు ఏర్పాటుచేసి ఆ వర్గంలో ఉన్న పేదలకు మేలు చేకూర్చే కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారు. మంజునాథ కమిషన్ నివేదికను త్వరితగతిన రాబట్టి కాపులను కూడా బిసిల్లో చేర్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మొత్తంమీద బుడిబుడి అడుగులు వేస్తూ ఇబ్బందులు, కష్టాలు ఎదురవుతున్నా ఇలాంటి సమస్యలను కూడా అవకాశాలుగా మార్చుకుంటూ రాష్ట్ర సమగ్రాభివృద్ధి వైపు చంద్రబాబు చేతుల మీదుగా అడుగులు వేస్తున్నాం.

- బడేటి కోట రామారావు (బుజ్జి) ఏలూరు ఎమ్మెల్యే, పశ్చిమగోదావరి జిల్లా