ఫోకస్

శే్వతపత్రం ప్రకటించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చంద్రబాబునాయుడు మూడేళ్ల పాలనపై శే్వతపత్రం ప్రకటించాలి. ఈ మూడేళ్లలో పెద్దగా ఏమీ సాధించలేదని అనుకుంటున్నా.. మొన్న జరిగిన మహానాడులో కూడా ఆయన మాటలు అస్పష్టంగానే వున్నాయి. ఇప్పటికైనా, కనీసం వారి పార్టీ సభ్యులకైనా ప్రభుత్వం చేస్తున్న పనులపై అవగాహన అవసరం. పట్టిసీమ గురించి నేను లేవనెత్తిన సందేహాలకు సమాధానం చెప్పకుండా నాపై వ్యక్తిగతంగా అనరాని మాటలు అన్నారు. ఇవాళ కాగ్ కూడా సరిగ్గా నేను లేవనెత్తిన అంశాలనే ప్రశ్నించింది. పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం భూసేకరణ విషయంలో 144 సెక్షన్ పెట్టి పనులు చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. కేంద్రం రాష్ట్ర విభజన చట్టంలో ఏవైతే ఎపికి ఇవ్వాలని ప్రస్తావించిందో అవి తెచ్చుకోవడంలో కూడా సిఎం విఫలమయ్యారు. ఎన్నికల మేనిఫేస్టోలో కూడా ఇది చేశామని చెప్పడానికి దాదాపు ఒక్క అంశం కూడా లేదు. చంద్రబాబునాయుడు మూడేళ్ళ పరిపాలన విషయంలో ఏవేమి సాధించారో శే్వతపత్రం ప్రకటించాలి. అమరావతి, పోలవరం ఈ రెండింటిపైనా సామాన్య వ్యక్తులకు నేటికీ అవగాహన రాలేదు. చంద్రబాబు ఎంత కష్టపడుతున్నాడో చెప్పుకునే ప్రయత్నమే గానీ ఆ కష్టానికి ఎంత ఫలితం దక్కిందనేది రాష్ట్రానికి దక్కలేదు. రూ.14 లక్షల కోట్లకు ఎంఒయులయ్యాయని, ఈ పరిశ్రమల ద్వారా 30 లక్షల మందికి ఉపాధి ఏర్పడుతుందని మహానాడులో చంద్రబాబు ప్రకటించారు. అయితే రాష్ట్రంలో ఎక్కడా ఒక్క పరిశ్రమ కూడా శంకుస్థాపన జరిగి దాఖలాలు లేవు. అమరావతిపై ‘మాకీ’ అనే అంతర్జాతీయ ఆర్కిటెక్చర్ కంపెనీ అధినేత చాలా దారుణమైన వ్యాఖ్యలు చేశాడు. ఆంధ్రప్రదేశ్ కంటే బిహార్ నయమని వ్యఖ్యానించాడు. పోలవరం కాఫర్ డ్యామ్‌తోనే గ్రావిటీతో నీళ్ళు ఇస్తామని ప్రకటిస్తున్నారు... మామూలు పరిభాషలో కాఫర్ డ్యామ్ అంటే నదీ గర్భంలో పనులు జరగడానికి సీజన్‌లో ప్రవాహానికి అడ్డుకట్ట వేసి ఒక తాత్కాలిక డ్యామ్, వరద రాగానే కొట్టుకుపోతుంది. మరి ఇదేమిటో వారికే తెలియాలి. ఇలాంటి వారిపై ప్రజలకు అర్థమయ్యేలా పూర్తి వివరణ ఇవ్వాలి.

- ఉండవల్లి అరుణ్‌కుమార్, మాజీ ఎంపి రాజమహేంద్రవరం