ఫోకస్

దేశంలోనే సంచలనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గడచిన మూడేళ్ల కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన వివిధ సంక్షేమ, అభివృద్ధి పథకాలు దేశ చరిత్రలోనే సరికొత్త రికార్డు సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా రాష్ట్రం తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నప్పటికీ రైతులకు రూ.24వేల కోట్ల రుణమాఫీ, 45లక్షల మందికి రకరకాల పెన్షన్లు, ఒక రూపాయికి కిలో బియ్యం చొప్పున లక్షా 40వేల మంది కార్డుదారులకు బియ్యం పంపిణీ జరుగుతోంది. తొలిసారిగా అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యుని పోస్టు ఒక్కటి కూడా ఖాళీగా లేకుండా చర్యలు తీసుకున్నాము. ఒక్కమాటలో చెప్పాలంటే ఎన్నికల హామీలు, ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్న అంశాలన్నీ అమలు జరుగుతున్నాయి. విద్యుత్, నీటిపారుదల, వ్యవసాయ రంగాల్లో గణనీయ ప్రగతి సాధించాం. 24 గంటలపాటు నాణ్యమైన విద్యుత్, వ్యక్తిగత మరుగుదొడ్లు, ఆడపిల్లలకు సైకిళ్లు, ఆరోగ్య బీమా.. ఇలా ఎన్నో అంశాల్లో గణనీయమైన మార్పులు తెస్తూ రాష్ట్రాన్ని నెంబర్-1గా మారుస్తూ పలు పథకాల్లో అవార్డులు సాధిస్తున్నాం. ఎస్సీ, ఎస్టీ, బిసి సబ్‌ప్లాన్‌లను మరింత సమర్థంగా తీర్చిదిద్దుతున్నాం. ప్రభుత్వం వట్టి మాటలు చెప్పటం కాకుండా ప్రతి ఇంటికీ ఎలాంటి లబ్ధి చేకూరిందీ వివరాలు వెల్లడించబోతున్నాం. ముఖ్యంగా 86లక్షల 79వేల 128 మంది డ్వాక్రా మహిళలకు లబ్ధి చేకూర్చాం. అన్నింటికీ మించి ప్రతిపక్షం అడ్డుపడ్డా పట్టిసీమను ఆరుమాసాల్లో పూర్తిచేసి గోదావరి నీటిని కృష్ణాలోకి పారించడం ఒక రికార్డు. దీనివల్ల రెండేళ్లలో రూ.2500 కోట్ల విలువైన పంటను కాపాడి రైతుల కళ్లల్లో వెలుగు నింపగలిగాం.

- ప్రత్తిపాటి పుల్లారావు, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి